ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలి బొటనవేళ్ల ద్వారా...

ABN, First Publish Date - 2020-04-28T16:29:40+05:30

కరోనా సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు పొడి దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది. అయితే ఈ లక్షణాలతో పాటు మరొక ప్రధాన లక్షణం కూడా కనిపించే వీలుంది. అదే - ‘కొవిడ్‌ టోస్‌’!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-04-2020)

కరోనా సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు పొడి దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది. అయితే ఈ లక్షణాలతో పాటు మరొక ప్రధాన లక్షణం కూడా కనిపించే వీలుంది. అదే - ‘కొవిడ్‌ టోస్‌’!


‘కొవిడ్‌ - 19’ సోకిన రోగుల పాదాలు, లేదా బొటనవేళ్ల మీద వంకాయ రంగు పుళ్లను, కందిపోయినట్టు కనిపించే దద్దుర్లను చర్మసంబంధ నిపుణులు గమనిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పని చేస్తున్న ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ ఛీఫ్‌గా పని చేస్తున్న డాక్టర్‌ ఎడిన్‌ ల్యూటిన్‌బాక్‌ ఈ లక్షణాన్ని గమనించారు. తాకినప్పుడు నొప్పి కలిగించే ఈ పుళ్లు, మంట పెడుతూ ఉంటాయని ఆయన అంటున్నారు. ఈ లక్షణం ‘కొవిడ్‌ - 19’ సోకి లక్షణాలు కనిపించిన వారిలో, బయల్పడని వారిలో... ఇద్దరిలోనూ కనిపించే వీలుందని ఆయన అంటున్నారు. ఈ లక్షణం కరోనా సోకిన పిల్లల్లో, యుక్తవయస్కుల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.


ఈ లక్షణానికి కారణం పాదాల్లోని రక్తనాళాల్లో రక్తం చిన్న చిన్న గడ్డలు ఏర్పడడమే! మరీ ముఖ్యంగా కరోనా సోకి, ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌కు దారితీసిన పరిస్థితిలో ‘కొవిడ్‌ టోస్‌’ లక్షణం కనిపించే వీలుందని ఆయన అంటున్నారు. ఇంతటి తీవ్రతకు చేరుకోని కొవిడ్‌ బాధితుల్లో ఈ లక్షణం 10 రోజుల్లోనే మాయమవుతుందట!

Updated Date - 2020-04-28T16:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising