ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల గుండెకు కరోనా గండం!!

ABN, First Publish Date - 2020-09-07T18:50:29+05:30

కరోనా మహమ్మారి బారినపడిన పిల్లల గుండెను గుల్లబారుస్తోంది ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ (ఎంఐఎస్‌ -సీ). వైరస్‌ సోకిన నాలుగు వారాల తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలుకున్న నాలుగువారాల తర్వాత బయటపడుతున్న ‘ఎంఐఎ్‌స-సీ’ సిండ్రోమ్‌.. టెక్సస్‌ వర్సిటీ అధ్యయనం


హ్యూస్టన్‌ (అమెరికా), సెప్టెంబరు 6 : కరోనా మహమ్మారి బారినపడిన పిల్లల గుండెను గుల్లబారుస్తోంది ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ (ఎంఐఎస్‌ -సీ). వైరస్‌ సోకిన నాలుగు వారాల తర్వాత గానీ.. ఆ మాయదారి ‘సిండ్రోమ్‌’ చాపకింద నీరులా పిల్లల గుండెను హైజాక్‌ చేసి గుప్పిట్లోకి తీసుకున్న విషయం బయటపడటం లేదు. ఈ ఆకస్మిక ముప్పు ముంచుకొచ్చి అభం శుభం ఎరుగని పిల్లల ఆరోగ్యాలను కోలుకోలేనంత దెబ్బ తీస్తోందని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. జనవరి నెలలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎంఐఎ్‌స-సీ కేసులు పెరుగుతూపోతున్నాయని అమెరికాలోని టెక్సస్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.


జనవరి 1 నుంచి జూలై 25 మధ్య ప్రపంచవ్యాప్తంగా నమోదైన 662 ఎంఐఎ్‌స-సీ కేసుల వివరాల పరిశీలన అనంతరం వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ పిల్లలంతా జ్వరంతో బాధపడగా.. 73.7 శాతం మందికి కడుపు నొప్పి లేదా అతిసారం, 68.3 శాతం మంది వాంతులు చేసుకున్నారని తెలిపారు. కరోనాతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో చేరిన పిల్లల్లో 71 శాతం మందిలో ఎంఐఎ్‌స-సీ ఉన్నట్లు తేలిందన్నారు. సగటున 7.9 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన పిల్లల్లో 60 శాతం మందిలో వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎంఐఎ్‌స-సీ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన పిల్లల గుండెలోని కండరాలు, కవాటాల పనితీరును తెలుసుకునేందుకు ఎలకో్ట్ర కార్డియోగ్రఫీ(ఈసీజీ) పరీక్ష నిర్వహించగా 54ు పరిస్థితి అసాధారణంగా ఉన్నట్లు వెలుగుచూసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం 662 మంది పిల్లల్లో ఐదోవంతు మందికి మెకానికల్‌ వెం టిలేషన్‌ అందించినా.. 11 మంది చికిత్సపొందుతూ మరణించారన్నారు.


Updated Date - 2020-09-07T18:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising