ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోసారీ సోకుతుందా?

ABN, First Publish Date - 2020-06-16T17:52:58+05:30

ఒకసారి కరోనా పాజిటివ్‌ వస్తే, వ్యాధి తగ్గిన తర్వాత మళ్లీ అదే వ్యాధి సోకే అవకాశం ఉందా? ఈ ప్రశ్న అంతటా తలెత్తుతోంది. అయితే ఈ ప్రశ్నకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-05-2020)

ఒకసారి కరోనా పాజిటివ్‌ వస్తే, వ్యాధి తగ్గిన తర్వాత మళ్లీ అదే వ్యాధి సోకే అవకాశం ఉందా? ఈ ప్రశ్న అంతటా తలెత్తుతోంది. అయితే ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే పరిస్థితి లేకపోయినా, ఇప్పటివరకూ జరిపిన అధ్యయనాలు, ప్రయోగాల ద్వారా వైద్యులు ఓ నిర్థారణకు వచ్చారు. 


సాధారణంగా చికెన్‌పాక్స్‌, మీజిల్స్‌ మొదలైన వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు గురైతే ఆ వ్యాధి మరోసారి సోకే వీలు లేకుండా, శరీరంలో యాంటీ బాడీలు తయారవుతాయి. అదే వైరస్‌ రెండోసారి ఎదురైనప్పుడు, ఆ వ్యాధి సోకకుండా ఈ యాంటీ బాడీలు జీవితకాలం రక్షణ కల్పిస్తాయి. అయితే ఫ్లూ, డెంగ్యూ, జలుబు మొదలైన ఇతర వైర్‌సల విషయంలో ఇలా జరగడం లేదు. కరోనా వైరస్‌ సోకినప్పుడు ఆ వైరస్‌ తిష్ఠ వేసి ఉండే శ్వాసకోశ వ్యవస్థలోకి యాంటీ బాడీలు చేరుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో అలా జరగడం లేదు. అలాగే సాధారణంగా ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు శరీరంలో కొంతమేరకు వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. అయితే ఆ వ్యాధినిరోధకశక్తి ఎంత బలంగా ఉంది? అంతటి సామర్థ్యాన్ని ఎంత వరకూ కలిగి ఉంటుంది? అనే అంశాల మీద అదే ఇన్‌ఫెక్షన్‌ రెండోసారి సోకే అంశం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలా వ్యాధినిరోధకశక్తి తత్వాన్ని అంచనా వేసే వీలు లేదు కాబట్టి, ‘కొవిడ్‌ - 19’ ఇన్‌ఫెక్షన్‌ సోకి, తగ్గిన తర్వాత, రక్తంలో కొవిడ్‌ యాంటీ బాడీలు కనిపించినా రెండోసారి ఆ వైరస్‌ సోకదనే నమ్మకం లేదు. కాబట్టి ముఖానికి మాస్క్‌ ధరించడం, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు ఎప్పటికీ అనుసరిస్తూనే ఉండాలి అంటున్నారు వైద్యులు.

Updated Date - 2020-06-16T17:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising