ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్దెనిమిదేళ్లకే జుట్టు రాలుతోంది.. ఏం చేయమంటారు..?

ABN, First Publish Date - 2020-10-26T20:45:36+05:30

వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, నిద్రలేమి, హార్మోన్‌ల అసమతుల్యత, ఒత్తిడి... ఇలా పలు కారణాల వల్ల యుక్తవయసులో కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. స్పెషలిస్టును కలిసి కారణం తెలుసుకోండి. దాంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(26-10-2020)

ప్రశ్న: నా  వయసు పద్దెనిమిదేళ్లు. జుట్టు రాలుతోంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? 


- భగత్‌, తిరుపతి


డాక్టర్ సమాధానం: వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, నిద్రలేమి, హార్మోన్‌ల అసమతుల్యత, ఒత్తిడి... ఇలా పలు కారణాల వల్ల యుక్తవయసులో కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. స్పెషలిస్టును కలిసి కారణం తెలుసుకోండి. దాంతో పాటు మీ సమస్యను తగ్గించడానికి ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు, పన్నీర్‌, సొయా గింజలు, అన్ని రకాల పప్పు ధాన్యాలు తప్పకుండా తీసుకోండి. వీటితో  పాటు పాలు, పెరుగు, ముడి ధాన్యాలు, ఆకుకూరలు ఎంతో అవసరం. వీటిలోని ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఉండడానికి,  ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసె గింజలు మొదలైన వాటిల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కూడా ఉపయోగపడతాయి. ఆహార జాగ్రత్తలతో పాటు, జీవన విధానంలో స్ట్రెస్‌ లేదా ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


Updated Date - 2020-10-26T20:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising