ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కండిషనర్‌ ఇలా కూడా!

ABN, First Publish Date - 2020-07-11T18:38:35+05:30

తలంటుకున్న తర్వాత కురులను మృదువుగా, చిక్కులు లేకుండా చేసేందుకు కండిషనర్‌ వాడతాం. మళ్లీ వెంట్రుకలను శుభ్రం చేసుకునేటప్పుడు తప్ప కండిషనర్‌ గుర్తుకురాదు. అయితే కండిషనర్‌తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(11-07-2020)

తలంటుకున్న తర్వాత కురులను మృదువుగా, చిక్కులు లేకుండా చేసేందుకు కండిషనర్‌ వాడతాం. మళ్లీ వెంట్రుకలను శుభ్రం చేసుకునేటప్పుడు తప్ప కండిషనర్‌ గుర్తుకురాదు. అయితే కండిషనర్‌తో మరిన్ని ఉపయోగాలున్నాయి. అవేమిటంటే...


బాత్‌ మాయిశ్చరైజర్‌: కండిషనర్‌ బాత్‌ మాయిశ్చరైజర్‌గానూ పనికొస్తుంది. ముఖ్యంగా బాడీ స్క్రబ్‌ వాడినప్పుడు ఎక్కువ నురుగు వస్తుంది. అందుకే చర్మం తిరిగి సహజమైన తేమను పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొద్దిగా కండిషనర్‌ ఉపయోగించాలి. 


ఫ్రెష్‌నర్‌గా: కండిషనర్‌ సువాసన కలిగి ఉంటుంది. స్ర్పే బాటిల్‌లో కొద్దిగా నీళ్లు, కండిషనర్‌ తీసుకొని బాగా కదపాలి. ఇప్పుడు ఈ స్ర్పేను వెంట్రుకల మీద, దుస్తుల మీద చల్లితే అవి సువాసన వెదజల్లుతాయి. 


చర్మం మృదువుగా: మెనిక్యూర్‌ (చేతులు, చేతిగోళ్లను సింగారించడం), పెడిక్యూర్‌ (పాదాలు, కాలిగోళ్లను సొగసుగా మార్చడం)చేసే సమయంలో చర్మం లేచివస్తుంది. అప్పుడు కొద్దిగా కండిషనర్‌ను దూది ఉండ మీద రాసి, గోళ్ల మీద మసాజ్‌ చేసినట్టు రుద్దుకోవాలి. దాంతో గోళ్ల దగ్గరి చర్మం మృదువుగా మారుతుంది.


లాండ్రీ సోప్‌గా: సమయానికి లాండ్రీ సోప్‌ అందుబాటులో లేనప్పుడు కండిషనర్‌ వాడొచ్చు. ముందుగా దుస్తులను వేడినీళ్లలో నానబెట్టి తర్వాత ఒక టీ స్పూన్‌ కండిషనర్‌ వేయాలి. వాటిని అరగంట సేపు నురుగు నీళ్లలోనే ఉంచాలి. తర్వాత వాటిని నీళ్లలో తీసి ఆరబెడితే సరి!

Updated Date - 2020-07-11T18:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising