ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మం ద్వారా కోవ్యాక్సిన్‌!!

ABN, First Publish Date - 2020-08-21T21:19:11+05:30

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ (కోవ్యాక్సిన్‌)తో మరో కొత్త తరహా ప్రయోగ పరీక్షలకు రంగం సిద్ధమవు తోంది. ఇప్పటివరకు వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇంట్రాడెర్మల్‌’ ప్రయోగ పరీక్షలకు భారత్‌ బయోటెక్‌ యోచన

న్యూఢిల్లీ, ఆగస్టు 20 : హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ (కోవ్యాక్సిన్‌)తో మరో కొత్త తరహా ప్రయోగ పరీక్షలకు రంగం సిద్ధమవు తోంది. ఇప్పటివరకు వలంటీర్లకు కండరంలోకి వ్యాక్సిన్‌ను ఇస్తుండగా.. ఇకపై చర్మపు రెండో పొర డెర్మి్‌సలోకీ వ్యాక్సి నేషన్‌ చేయాలని ఆ కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేక వైద్య కేంద్రాలను, వలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పద్ధతిలో మొదటి, రెండో దశ ప్రయోగ పరీక్షలకు అనుమతులను కోరుతూ భారత్‌ బయోటెక్‌ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) నుంచి ఆమోదం లభించింది.


చర్మపు లోపలి పొరలకు వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని ఇంట్రాడెర్మల్‌ వ్యాక్సినేషన్‌ అంటారు. బీసీజీ, రేబిస్‌ వ్యాక్సిన్లను ఈ పద్ధతిలోనే వేస్తుంటారు. భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ను ‘ఇంట్రాడెర్మల్‌ డెలివరీ’ రూట్‌లో పరీక్షించేందుకు సిద్ధమవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. ఈ రూట్‌లో వ్యాక్సినేషన్‌ కోసం చాలా తక్కువ డోసును వాడితే సరిపోతుంది. రెండోది.. చర్మంలోని డెర్మిస్‌, ఎపిడెర్మిస్‌ పొరల్లో యాంటీజెన్‌ ప్రెజెంటింగ్‌ సెల్స్‌ (ఏపీసీ) అనే రోగ నిరోధక కణాలు సమృద్ధిగా ఉంటాయి. టీ-సెల్స్‌, యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే బీ-సెల్స్‌ను చైతన్యవంతం చేసే సామర్థ్యం వీటి సొంతం. అతి తక్కువ డోసు వ్యాక్సిన్‌తోనూ ఏపీసీలు క్రియాశీలంగా మారి రోగ నిరోధక వ్యవస్థను మేల్కొలపగలవు. ఈ కారణాల వల్లే ‘ఇంట్రాడెర్మల్‌’ రూట్‌లో వ్యాక్సిన్‌ పరీక్షలకు భారత్‌ బయోటెక్‌ సిద్ధమవుతోంది.


Updated Date - 2020-08-21T21:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising