ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో గుండెకు ముప్పు

ABN, First Publish Date - 2020-04-10T16:58:55+05:30

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు కరోనా నిరోధానికి ప్రభావవంతంగా పనిచేస్తాయన్న వార్తలతో వాటికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ మాత్రలను ఇప్పటికే కొని ఇంట్లో దాచుకున్నారు. కరోనా సోకిన వారికి వైద్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యుల సూచనల మేరకే వాడాలి

కెనడా శాస్త్రవేత్తల హెచ్చరిక


టొరంటో, ఏప్రిల్‌ 9: హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు కరోనా నిరోధానికి ప్రభావవంతంగా పనిచేస్తాయన్న వార్తలతో వాటికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ మాత్రలను ఇప్పటికే కొని ఇంట్లో దాచుకున్నారు. కరోనా సోకిన వారికి వైద్యం అందించేవారు ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ వేసుకోవచ్చని ఐసీఎంఆర్‌ కూడా సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ మాత్రలు కొవిడ్‌ను పూర్తిగా నిరోధిస్తాయనడానికి తగినన్ని ఆధారాలు లేవని కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు. వైద్యుల సూచన మేరకే వీటిని వాడాలని సూచించారు. లేకపోతే మూర్చ, కోమా, గుండెపోటు లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రక్తంలో చక్కెరల స్థాయి కూడా పడిపోతుందని పేర్కొన్నారు. ఈ మేరకు తమ అధ్యయనాన్ని కెనెడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు.

Updated Date - 2020-04-10T16:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising