ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలికా కషాయంతో కరోనాకు చెక్‌!

ABN, First Publish Date - 2020-04-28T15:19:55+05:30

కరోనా వైర్‌సను ఎదుర్కొనేలా ప్రజల రోగనిరోధక శక్తిని పెంచే మూలికా ఔషధ ఫార్ములాతో కేంద్ర ఆయుష్‌ శాఖ ముందుకొచ్చింది. దాని ఆధారంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగ నిరోధక శక్తిని పెంచే ‘ఆయుష్‌’ ఫార్ములా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27 : కరోనా వైర్‌సను ఎదుర్కొనేలా ప్రజల రోగనిరోధక శక్తిని పెంచే మూలికా ఔషధ ఫార్ములాతో కేంద్ర ఆయుష్‌ శాఖ ముందుకొచ్చింది. దాని ఆధారంగా టీ పొడులు, మాత్రల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఓ లేఖ రాసింది. ‘ఆయుష్‌ క్వాత్‌’, ‘ఆయుష్‌ కుదినీర్‌’, ఆయుష్‌ జోషంద’ అనే జనరిక్‌ పేర్లతో విక్రయించాలని సూచించింది. వీటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది. కాగా, ఈ మూలికా ఔషధంలో తులసి ఆకుల పొడి, దాల్చిని చెక్క పొడి, శొంటి పొడి, మిరియాల పొడి ఉంటాయి. ఈ పొడులన్నీ కలిపిన 3 గ్రాముల మిశ్రమాన్ని 150 మిల్లీలీటర్ల మరిగించిన నీళ్లలో వేసి కషాయం (డికాక్షన్‌)గా చేసుకొని రోజూ ఒకటి లేదా రెండుసార్లు తాగొచ్చు. కాగా, కరోనా బారినపడకుండా రోగ నిరోధక వ్యవస్థను సమాయత్తం చేసుకునేందుకు వృద్ధులు తీసుకోవాల్సిన పలు మూలికా ఔషధాలను దాదీదాదా ఫౌండేషన్‌ సూచించింది. స్వర్ణ వసంత్‌ మాలతీ, చయన్‌ప్ర్‌షల వాడకంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంది. 

Updated Date - 2020-04-28T15:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising