ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూనెతో పుక్కిలిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..

ABN, First Publish Date - 2020-07-21T19:14:29+05:30

నూనెతో నోరు పుక్కిలింత ప్రాచీన ఆయుర్వేద చిట్కా. ఎంతో సులువైన, సమర్థమైన, ఖర్చులేని స్వీయ చికిత్స ఇది. ఈ పని చేయడానికి నియమిత వేళలు, పద్ధతి పాటించినప్పుడే తగిన ఫలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-07-2020)

నూనెతో నోరు పుక్కిలింత ప్రాచీన ఆయుర్వేద చిట్కా. ఎంతో సులువైన, సమర్థమైన, ఖర్చులేని స్వీయ చికిత్స ఇది. ఈ పని చేయడానికి నియమిత వేళలు, పద్ధతి పాటించినప్పుడే తగిన ఫలితం దక్కుతుంది.


ఎప్పుడు, ఎలా?

నూనె పుక్కిలింత ఉదయం అల్పాహారానికి ముందే చేయాలి. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె గరిటెడు నోట్లో పోసుకుని మింగకుండా, పుక్కిలించాలి. దంతాలు, చిగుళ్ల నడుమ తిరిగేలా నూనెను పుక్కిలించాలి. ఇలా 30 రోజుల పాటు క్రమం తప్పకుండా, రోజుకు 20 నిమిషాలపాటు చేయాలి. 20 నిమిషాల తర్వాత నూనెను ఉమ్మి వేయాలి. ఇలా పుక్కిలించిన నూనెలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి మింగకూడదు. ఉమ్మి వేసిన తర్వాత దంతధావనం చేయాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని నోరు కడుక్కోవచ్చు. 


ఆరోగ్య ప్రయోజనాలు:

నూనె పుక్కిలింత వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటంటే....


మొటిమలు తగ్గుతాయి.

ఎలర్జీలు అదుపులోకి వస్తాయి. 

మలబద్ధకం వదులుతుంది.

దంతక్షయం తగ్గుతుంది. 

చిగుళ్ల వ్యాధులు నయమవుతాయి.

తామర మొదలైన చర్మ వ్యాధులు తగ్గుతాయి.

నిద్రలేమి దూరమవుతుంది.

నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది.

నోటి దుర్వాసన వదులుతుంది.

జీర్ణశక్తి పెరుగుతుంది.

హర్మోన్ల అసమతౌల్యం సమమవుతుంది.

Updated Date - 2020-07-21T19:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising