ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్యూనిటీ పెరగాలంటే....

ABN, First Publish Date - 2020-09-15T17:26:14+05:30

కరోనా రక్షణ చర్యల్లో ప్రధానమైనది సమర్థమైన వ్యాధినిరోధకశక్తి. దీని పెంపు కోసం అనుసరించవలసిన నియమాలను ఆయుర్వేదం సూచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(15-09-2020)

కరోనా రక్షణ చర్యల్లో ప్రధానమైనది సమర్థమైన వ్యాధినిరోధకశక్తి. దీని పెంపు కోసం అనుసరించవలసిన నియమాలను ఆయుర్వేదం సూచిస్తోంది. 


మర్దన: స్వీయ మర్దనతో నాడులు విశ్రాంతి పొందుతాయి. ఒత్తిడి తొలగి వ్యాధినిరోధకశక్తి మెరుగవుతుంది. ఇందుకోసం నువ్వుల నూనెతో ప్రతి రోజూ అభ్యంగనం చేసుకోవాలి. దీంతో పాటు ఆయిల్‌ పుల్లింగ్‌ (నూనెతో నోరు పుక్కిలించడం), నశ్య క్రియ కూడా సాధన చేస్తే ఫలితం ఉంటుంది. 


ఇన్వర్టెడ్‌ యోగా: శరీరం ముడుచుకునే యోగాసనాలతో కూడిన ఇన్వర్టెడ్‌ యోగాతో లింఫ్‌ స్రావాల ప్రసారం పెరిగి, వ్యర్థాలు, సూక్ష్మక్రిములు బయటకు వెళ్లిపోతాయి. ఇందుకోసం ఛాతీ కంటే తల దిగువకు ఉండే ఉత్తనాసనం, సర్వాంగాసనం వేయాలి. ఈ ఆసనాలతో లింఫ్‌ స్రావాలు తేలికగా శరీరంలోకి సూక్ష్మక్రిములు చొరబడే వీలున్న శ్వాసతో సంబంధం కలిగిన అవయవాల్లోకి చేరి వాటిని వెలుపలికి తీసుకువస్తాయి.


తీయని, చల్లని, వేయించిన పదార్థాలు వద్దు: చల్లని పానీయాలు, పదార్థాలు తీసుకుంటే జీర్ణాగ్ని నెమ్మదిస్తుంది. వేయించిన పదార్థాల అజీర్తిని కలిగిస్తాయి. తీపి కఫాన్ని పెంచుతుంది. కాబట్టి వీటిని తగ్గించాలి.


తులసి: తులసికి కఫాన్ని కరిగించి, బయటకు తెప్పించే గుణం ఉంటుంది. జలుబును కలిగించే ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కాచిన తులసి నీళ్లు తీసుకోవాలి.   

Updated Date - 2020-09-15T17:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising