ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చందనాసవ

ABN, First Publish Date - 2020-12-01T17:36:43+05:30

భారతీయ ఆయుర్వేద వైద్యంలో మేహా రోగాలలో చందనాసవ ఉపయోగం ప్రాచుర్యంలో ఉంది. ఆయుర్వేద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(01-12-2020)

భారతీయ ఆయుర్వేద వైద్యంలో మేహా రోగాలలో చందనాసవ ఉపయోగం ప్రాచుర్యంలో ఉంది. ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన బైషజ్య రత్నావళిలో ఈ ఔషధం తయారీ, ఉపయోగాల గురించి వివరంగా ఉంది. అదేవిధంగా ఆయుర్వేదిక్‌ ఫార్ములేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ ఔషధం నమోదు అయింది. 


చందనాసవలో ముఖ్యంగా వాడే మూలికలలో మొదటిది శ్రీగంధం. దీనినే చందనం అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం సాంటలమ్‌ ఆల్బమ్‌. ఇది పెద్ద వృక్ష జాతిలోనిది. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశపు అడవులలో పెరుగుతుంది. దీని బెరడు ఔషధంగా, పూజాద్రవ్యంగా, సుగంధ ద్రవ్యంగానూ పూర్వకాలం నుంచి వాడుకలో ఉంది. చందనాసవ తయారీలో శ్రీగంధంతో పాటుగా రక్తచందనం, మంజిష్ట, ప్రియాంగు, తుంగముస్తల, నేలవేము వంటి మూలకాలతో ఆసవ విధానంలో తయారుచేస్తారు.


మేహ రోగాలలో ముఖ్యంగా శుక్ర మేహంలో బాగా ఉపయోగపడుతుంది. అనగా మూత్రంలో, నిద్రలో వీర్యం పోవడం వంటి లక్షణాలలో బాగా పనిచేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. మగవాళ్లలో ప్రొస్టేట్‌ గ్రంథి సంబంధిత సమస్యలను, మూత్రం పోయేటప్పుడు మంట, రక్తం పడడం వంటి వాటిని తగ్గిస్తుంది. పేగుల్లో పూత, నోటి పూతకు బాగా పనిచేస్తుంది. కేన్సర్‌ రోగుల్లో వచ్చే ఇబ్బందులకు అనుపానంగా దీనిని ఉపయోగిస్తారు. చిన్నపిల్లల్లో వేడిని తగ్గించడానికి, వేడి వల్ల చిన్నపిల్లల్లో   చర్మం పొడిబారటం, దాని వల్ల వచ్చే దద్దుర్లు వంటి వాటి నుంచి ఇది వాడడం వల్ల రక్షణ పొందవచ్చు అని మా అనుభవంలో తెలిసింది. 


ఉపయోగించాల్సిన మోతాదు: పెద్దలు 10 మి.లీ ఉదయం, సాయంత్రం, పిల్లలు 5 మి.లీ లేదా వైద్యుల సూచన ప్రకారం వాడవలెను. ప్రస్తుతం ధూత్‌ పాపేశ్వర్‌, జైధ్యనాథ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద ఔషధ సంస్థలు చందనాసవ తయారుచేస్తున్నాయి. 


జి.శశిధర్‌

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల 


Updated Date - 2020-12-01T17:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising