ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంటీబాడీలు ఉండేది నెలన్నరే !

ABN, First Publish Date - 2020-10-20T16:44:28+05:30

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎంతకాలం పాటు యాంటీబాడీలు ఉంటాయి ? అనే ప్రశ్నకు కెనడాలోని మాంట్రియాల్‌ వర్సిటీ అధ్యయనంలో సమాధానం లభించింది. ఇన్ఫెక్షన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో, అక్టోబరు 19 : కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎంతకాలం పాటు యాంటీబాడీలు ఉంటాయి ? అనే ప్రశ్నకు కెనడాలోని మాంట్రియాల్‌ వర్సిటీ అధ్యయనంలో సమాధానం లభించింది. ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న కరోనా రోగుల రక్తంలో ఆరు నుంచి పదివారాల (42 - 70 రోజుల) తర్వాత  యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతోందని వారు గుర్తించారు. ఆ నిర్దిష్ట వ్యవధి గడవగానే.. కరోనా వైర్‌సకు ఆయువుపట్టయిన స్పైక్‌ ప్రొటీన్‌కు అడ్డుగోడలా నిలబడే ‘ఇమ్యునో గ్లోబులిన్‌- జీ, ‘ఏ’, ‘ఎం’ రకం యాంటీబాడీల సంఖ్య క్షీణిస్తోందని స్పష్టంచేశారు. ప్లాస్మా థెరపీ కోసం కోలుకున్న కరోనా రోగుల నుంచి ప్లాస్మాను సేకరించే క్రమంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇన్ఫెక్షన్‌ సోకిన 3 నుంచి ఆరువారాల తర్వాత రోగికి ప్లాస్మాను అందిస్తే.. అది వైర్‌సను ప్రభావవంతంగా నిర్వీర్యం చేయలేకపోతోందని వెల్లడించారు. 



Updated Date - 2020-10-20T16:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising