ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అయోమయం’ కొవిడ్‌ లక్షణం!

ABN, First Publish Date - 2020-11-10T17:36:00+05:30

కొవిడ్‌ సోకితే కనిపించే ప్రధాన లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం. కాబట్టి వీటి మీదే దృష్టి పెడుతూ ఉంటాం. అయితే కొందరిలో ‘అయోమయం’ కొవిడ్‌ ప్రధాన లక్షణంగా కనబడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-111-2020)

కొవిడ్‌ సోకితే కనిపించే ప్రధాన లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం. కాబట్టి వీటి మీదే దృష్టి పెడుతూ ఉంటాం. అయితే కొందరిలో ‘అయోమయం’ కొవిడ్‌ ప్రధాన లక్షణంగా కనబడుతోంది. 


‘డిలీరియం’... వాస్తవానికీ, భ్రమకూ మధ్య తేడా తెలియని ఈ స్థితిలో ఉన్న వ్యక్తి వాస్తవంతో సంబంధం కోల్పోయి, అయోమయానికి లోనవుతాడు. ఈ లక్షణాన్ని బట్టి, నాడీవ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం గురించి పలు పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలో... హైపోక్సియా, న్యూరోనల్‌ ఆక్సిజన్‌ డెఫిసియన్సీ, మెదడు కణజాలం వాపు (సైటోకైన్‌ స్టార్మ్‌)... ఈ మూడు పరిస్థితులను బట్టి నాడీవ్యవస్థ మీద కరోనా ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేయగలిగారు.


అయితే కరోనా వైరస్‌ ఈ మూడు స్థితుల ఫలితంగా మెదడు మీద పరోక్ష ప్రభావం చూపించడమే కాకుండా, బ్లడ్‌ బ్రెయిన్‌ అవరోధాన్ని అధిగమించి, నేరుగా మెదడుకే సోకే వీలూ లేకపోలేదని రుజువైంది. ఈ స్థితికి లోనయినవాళ్లలో సాధారణ కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలకు బదులుగా ‘డిలీరియం’ కనిపించవచ్చు.


ఇలాంటి వారిలో అయోమయం, మానసిక గందరగోళం, ఆలోచించే సామర్ధ్యం కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్రపట్టకపోవడం, ఏకాగ్రత లోపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.  


Updated Date - 2020-11-10T17:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising