ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార పదార్థాలను డీప్ ఫ్రై చేయడానికి బదులు ఇలా చేస్తే..

ABN, First Publish Date - 2020-05-19T18:26:25+05:30

ఎయిర్‌ ఫ్రైయర్‌లో ఆహారాన్ని వండడం మంచిదేనా? దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-05-2020):

ప్రశ్న: ఎయిర్‌ ఫ్రైయర్‌లో ఆహారాన్ని వండడం మంచిదేనా? దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?


- నర్మద, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వేపుడు పదార్థాలను చేసుకునే ఆధునిక సాధనాలే ఎయిర్‌ ఫ్రైయర్లు. బాగా మరిగించిన నూనెలో పదార్థాలను వేయిస్తే డీప్‌ ఫ్రై అంటారు. అదే ఎయిర్‌ ఫ్రైయర్లో పదార్థం చుట్టూ బాగా వేడిగా ఉన్న గాలిని పంపి ఫ్రై చేస్తారు. రుచి, ఇతర లక్షణాల కోసం ఒకటి, రెండు చెంచాలు నూనె వాడతారు. అంటే అతి తక్కువ నూనెతో డీప్‌ ఫ్రై చేయడం ఎయిర్‌ ఫ్రైయర్ల ద్వారా సాధ్యం. రంగు, రుచి, వాసన డీప్‌ ఫ్రై చేసిన వాటితో సమానంగా ఉంటాయి. నూనె తగ్గించడం వల్ల వచ్చే ఉపయోగాలన్నీ ఎయిర్‌ ఫ్రైయర్లు వాడటం వల్ల పొందవచ్చు. ఆ మేరకు ఇవి బరువు తగ్గాలనుకొనేవారికి, గుండె వ్యాధులు, రక్తపోటు, మధుమేహం నియంత్రించాలనుకొనేవారికి ప్రయోజనకరం. పదార్థాలను వేడి నూనెలో డీప్‌ ఫ్రై చేయడం వల్ల వచ్చే హానికర రసాయన మార్పులు కూడా ఎయిర్‌ ఫ్రై పద్ధతిలో తగ్గుతాయి. ఎంత తగ్గుతాయి అనేదాని మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇది తక్కువ హానికరమైనదే కానీ పూర్తిగా సురక్షితమైంది కాదు. ఉడికించడం, మగ్గించడం, తదితర ఆరోగ్యకరమైన వంట విధానాల్లో వచ్చే ప్రయోజనాలు ఇందులో లభించవు. వేపుడు పద్ధతిలో విటమిన్లు ఆవిరి కావడం, ఇతర సూక్ష్మ పోషకాలు శరీరం పీల్చుకోలేని విధంగా రసాయన మార్పులు చెందుతాయి. కాబట్టి పద్ధతి ఏదైనా ఆహారంలో వేపుడు పదార్థాలను తగ్గించడమే ఉత్తమ మార్గం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-19T18:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising