ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా శాంపిళ్ల సేక‘రణం’

ABN, First Publish Date - 2020-04-29T15:53:50+05:30

‘కరోనా లక్షణాలు కలిగిన వారి గొంతు, ముక్కు నుంచి స్రావాల సేకరణ కత్తిమీద సాములాంటి’ అని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు పుష్కర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్రావాలు సేకరించే సెకన్ల వ్యవధిలోనే వైరస్‌ ముప్పు

ఔరంగాబాద్‌ ఆస్పత్రి వైద్యురాలు 

పుష్కర్‌ దహివాల్‌ స్వీయ అనుభవం

ఔరంగాబాద్‌, ఏప్రిల్‌ 28 : ‘కరోనా లక్షణాలు కలిగిన వారి గొంతు, ముక్కు నుంచి స్రావాల సేకరణ కత్తిమీద సాములాంటి’ అని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు పుష్కర్‌ దహివాల్‌ అంటున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆమె రోజూ 80-100 మంది నుంచి స్రావాల శాంపిళ్లు సేకరిస్తున్నారు.


పీపీఈ కిట్ల ముసుగులో చెమటలు కక్కుతూ వరుసగా 3 రోజులు విధులు నిర్వర్తించిన తర్వాత 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి పుష్కర్‌ వెళ్లిపోతుంటారు. ‘‘10-12 సెంటీమీటర్ల పొడవు ఉండే చిన్నపాటి పరికరంతో 30-40 సెకన్లలోనే స్రావాలు సేకరిస్తాం. అనుమానిత లక్షణాలతో వచ్చేవాళ్లు దగ్గడం, తుమ్మడం లాంటివి చేయకముందే ఆ పని ముగించాలి. సేకరించిన తర్వాత స్రావాలు మీదపడ్డా ఇబ్బందే’’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-04-29T15:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising