అక్టోబరులో టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ
ABN, First Publish Date - 2020-08-22T13:42:33+05:30
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు(టీఎస్‌ఎస్పీ) విభాగానికి ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 19న శిక్షణ ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించారు. పోలీస్ శాఖలో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు(టీఎస్‌ఎస్పీ) విభాగానికి ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 19న శిక్షణ ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించారు. పోలీస్ శాఖలో సుమారు 17 వేల పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియలో టీఎ్‌సఎస్పీ నుంచి 3,800 మంది ఎంపికయ్యారు. సివిల్, ఏఆర్, తదితర అభ్యర్థులకు జనవరిలోనే శిక్షణ ప్రారంభమైంది. సరైన వసతులు లేకపోవడంతో టీఎ్‌సఎ్‌సపీ శిక్షణను వాయిదా వేశారు. అక్టోబరు మొదటి వారంలో సివిల్, ఏఆర్ అభ్యర్థుల శిక్షణ ముగిసిన తర్వాత వెంటనే 19 నుంచి టీఎ్‌సఎస్పీ శిక్షణ మొదలుపెట్టనున్నారు.
Updated Date - 2020-08-22T13:42:33+05:30 IST