ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది 181 రోజులే బడి..!

ABN, First Publish Date - 2020-08-22T14:04:20+05:30

2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్‌ రూపొందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైమరీ స్కూళ్ల  అకడమిక్‌ క్యాలెండర్‌ రెడీ

సెప్టెంబరు 5న పాఠశాలలు పునఃప్రారంభం


అమరావతి (ఆంధ్రజ్యోతి): 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్‌ రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ను  పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. సన్నాహక క్యాలెండర్‌ ప్రకారం ... వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు. సెప్టెంబరులో 21 రోజులు, అక్టోబరులో 21 రోజులు, నవంబరులో 24 రోజులు, డిసెంబరులో 25/22 రోజులు, జనవరిలో 20/23 రోజులు, ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 25 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద 2022-21లో 181 పనిదినాలు ఉంటాయి.   


పరీక్షల ప్రణాళిక:

నిర్మాణాత్మక మూల్యాంకనం-1  పరీక్షలు అక్టోబరులో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో,  నిర్మాణాత్మక మూల్యాంకనం-2  పరీక్షలు మార్చిలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయి. 


సెలవుల ప్రణాళిక:

దసరా 2.10.2020-26.10.2020, క్రిస్టమస్‌ 24.12.2020-28.12.2020, సంక్రాంతి 12.01.2021- 17.01.2021, వేసవిసెలవులు 24.04.2021-11.06.2021


కాలనిర్ణయ పట్టిక:

1 నుంచి 5 తరగతులకు మొదటి పీరియడ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్‌లు ఉంటాయి.


కాగా, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-3,  ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-4, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ క్లాస్‌-5లలో మూడేసి పాఠాలను తొలగించారు.

Updated Date - 2020-08-22T14:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising