ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం వల్లే విద్యా రంగం కుదేలు: పువ్వాడ

ABN, First Publish Date - 2020-09-14T17:34:57+05:30

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల వల్లే విద్యా రంగం కుదేలైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ విమర్శించారు. ఖమ్మంలో గ్రేస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 300 మంది ప్రైవేటు టీచర్లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం టౌన్‌, సెప్టెంబరు 13: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల వల్లే విద్యా రంగం కుదేలైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ విమర్శించారు. ఖమ్మంలో గ్రేస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 300 మంది ప్రైవేటు టీచర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌-19 వల్ల విద్యారంగం ఇంకా నిలదొక్కుకోలేదన్నారు. చిన్న ఉద్యోగాలు, తక్కువ వేతనంతో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యారంగం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలతో పాటు అందరిపై ఉందన్నారు. పువ్వాడ ఫౌండేషన్‌ తరఫున తాము కూడా ప్రైవేటు టీచర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


Updated Date - 2020-09-14T17:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising