వ్యాక్సిన్ వచ్చేంత వరకూ తరగతులు వద్దు : టీఎ్‌సపీటీఏ
ABN, First Publish Date - 2020-10-03T16:14:13+05:30
కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ పాఠశాలల్లో తరగతులు నిర్వహించవద్దని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎ్‌సపీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది
హైదరాబాద్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ పాఠశాలల్లో తరగతులు నిర్వహించవద్దని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎ్‌సపీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉందని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షౌకత్, నాగనమోని చెన్నరాములు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా పేదలని, కరోనా బారినపడితే వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయన్నారు.
Updated Date - 2020-10-03T16:14:13+05:30 IST