ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపిఎంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ ఉద్యోగాలు

ABN, First Publish Date - 2020-01-22T22:00:30+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టర్‌,ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌(హెల్త్‌) లేబరేటరీస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టర్‌,ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌(హెల్త్‌) లేబరేటరీస్‌ అండ్‌ ఫుడ్‌(హెల్త్‌) అడ్మినిస్ట్రేషన్‌; గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాల్లో ‘ఫుడ్‌ సేఫ్టీ
ఆఫీసర్‌’ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టిఎ్‌సపిఎ్‌ససి)
నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
 
ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ ఇన్‌ ఐపిఎం:
 
ఖాళీల సంఖ్య: 4
వయసు: 2019 జూలై 1 నాటికి 19 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
 ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, ఒబిసి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
పే స్కేలు: రూ.28,940 - రూ.78,910
ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఇన్‌ జిహెచ్‌ఎంసి
 
ఖాళీల సంఖ్య: 26
వయసు: 2019 జూలై 1 నాటికి 19 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, ఒబిసి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
పే స్కేలు: రూ.28,940 - రూ. 78,910
 
అర్హతలు
 
ఫుడ్‌ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/బయో టెక్నాలజీ/అగ్రికల్చలర్‌ సైన్స్‌/వెటర్నరీ సైన్సె్‌స/బయో కెమిస్ట్రీ / మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా మెడిసిన్‌లో డిగ్రీ ఉండాలి.
 
దరఖాస్తు ఫీజు
 
ప్రతి అభ్యర్థి ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ కింద రూ.200తో పాటు అదనంగా రూ.80 పరీక్ష ఫీజు చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిసి, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు, 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం
 
ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. పరీక్షలో కనబరిచిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. సర్టిఫికెట్‌లు అన్నీ సక్రమంగా ఉంటే ఫైనల్‌గా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అయితే ఓసీలు 40 శాతం; బీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు 30 శాతం మార్కులను ఆన్‌లైన్‌ పరీక్షలో క్వాలిఫైయింగ్‌గా నిర్ధారించారు.
పరీక్ష విధానం
 
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌. రెండో పేపర్‌ సంబంధిత సబ్జెక్టుకు సంబంధించింది. ఇది డిగ్రీ స్థాయిలో ఉండే పేపర్‌. ప్రశ్న పత్రంలో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు కేటాయించిన కాలవ్యవధి 150నిమిషాలు. రెండు పేపర్లకు కలిపి మొత్తం 300 మార్కులు కేటాయించారు. మొదటి పేపర్‌లో ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీ్‌షలో ఉంటాయి. రెండో పేపర్‌ మాత్రం కేవలం ఆంగ్లంలోనే ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ టైప్‌లోనే ఉంటాయి.
ముఖ్య సమాచారం
 
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 25
 
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: తరవాత ప్రకటిస్తారు
 
వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in
 

Updated Date - 2020-01-22T22:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising