ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల ముంగిట్లో ‘విద్యావారధి’

ABN, First Publish Date - 2020-08-01T17:44:49+05:30

విద్యావ్యవస్థ ప్రణాళిక మొత్తాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేసిందని, ఆ లోటును తీరుస్తూ విద్యార్థులు చదువు వైపు మొగ్గుచూపేలా ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి జిల్లాకు 1.2 లక్షలతో మొబైల్‌ వాహనాలు

ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు 


అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థ ప్రణాళిక మొత్తాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేసిందని, ఆ లోటును తీరుస్తూ విద్యార్థులు చదువు వైపు మొగ్గుచూపేలా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఎస్‌సీఈఆర్‌టీ - సీమ్యాట్‌ ఆధ్వర్యంలో తయారుచేసిన ‘విద్యావారధి’ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రాష్ట్రంలో దాదాపు 1.18లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక సౌకర్యాలు లేవని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలను గుర్తించి ‘విద్యావారధి మొబైల్‌ వ్యాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు రూ.1.2లక్షల ఖర్చుతో  వాహనాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇవి గ్రామాలకు వెళ్లి బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థుల స్థాయిని అనుసరించి పాఠాలు ప్రదర్శిస్తాయని చెప్పారు.  


Updated Date - 2020-08-01T17:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising