ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసెట్‌లో 96% మంది పాస్‌

ABN, First Publish Date - 2020-10-07T16:03:45+05:30

ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈసెట్‌-2020)లో 96.12% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈసెట్‌-2020)లో 96.12% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లేటరల్‌ ఎంట్రీలో ప్రవేశాల కోసం సెప్టెంబరు 14న నిర్వహించిన ఈసెట్‌ ఫలితాలను మంత్రి సురేశ్‌ మంగళవారం విడుదల చేశారు. జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించిన ఈసెట్‌కు 31,891 మంది అభ్యర్థులు హాజరు కాగా 30,654 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ర్యాంకు కార్డులను ఈ నెల 8 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.


బ్రాంచ్‌ల వారీగా టాపర్లు

అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌: గొర్తి వంశీకృష్ణ(అనంత), బీఎస్సీ గణితం: శివాల శ్రీనివాసరావు(శ్రీకాకుళం), సిరామిక్‌ టెక్నాలజీ: తూతిక సంతోశ్‌ కుమార్‌(ప్రకాశం), కెమికల్‌: ముస్తాక్‌ అహ్మద్‌(గుంటూరు), సివిల్‌: బానోతు అంజలి(ఖమ్మం), కంప్యూటర్‌ సైన్స్‌: కోడి తేజ(తూర్పుగోదావరి), ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌: నరేశ్‌ రెడ్డి(కడప), ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: కుర్రా వైష్ణవి(గుంటూరు), ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌: ఫృథ్వి(రంగారెడ్డి), మెకానికల్‌: గరగా అజయ్‌(విశాఖ), మెటలర్జికల్‌: వరుణ్‌రాజు(విజయనగరం), మైనింగ్‌: బానాల వంశీకృష్ణ(వరంగల్‌), ఫార్మసీ: ఆశ్లేశ్‌ కుమార్‌(కృష్ణా), శాంతి(శ్రీకాకుళం).

Updated Date - 2020-10-07T16:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising