చదువు+ఉద్యోగం
ABN, First Publish Date - 2020-06-18T18:37:24+05:30
ఇంటర్ తరవాత త్రివిధ దళాల్లో అధికారిగా సేవలు అందించేందుకు తగు శిక్షణ, మెడిసిన్ మినహా ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ అందించే అవకాశాన్ని ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామ్(నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్
ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామ్
ఇంటర్ తరవాత త్రివిధ దళాల్లో అధికారిగా సేవలు అందించేందుకు తగు శిక్షణ, మెడిసిన్ మినహా ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ అందించే అవకాశాన్ని ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామ్(నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్) కల్పిస్తోంది. కొద్దిగా భిన్నంగా యోచించే సాహసికులకు ఇది అనువైనది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఏటా రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామ్ రెండో విడత నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. జూలై 6లోపు దరఖాస్తు చేసుకోవాలి. కొవిడ్ నేపథ్యంలో మొదటి విడత నోటిఫికేషన్ ప్రకారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. ప్రస్తుతం ఈ రెంటికి కలిపి సెప్టెంబర్ 6న రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత నోటిఫికేషన్‌తో మొత్తం 413 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370(ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120), నేవల్ అకాడమీ(10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్)లో 43 పోస్టులను కేటాయించారు. అభ్యర్థులు ఏ విభాగానికి ప్రాధాన్యం ఇస్తున్నారో ముందే తెలియజేయాలి.
అర్హత - వయసు
ఆర్మీ వింగ్: 10+2 విధానంలో 12వ తరగతి ఉత్తీర్ణత/ తత్సమానం.
ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్: 10+2 విధానంలో మేథమెటిక్స్, ఫిజిక్స్‌లతో 12వ తరగతి ఉత్తీర్ణత/తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 2002 జనవరి 2 తరవాత, 2005 జనవరి 1కి ముందు జన్మించిన అభ్యర్థులు మాత్రమే వయసురీత్యా అర్హులు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు, ఎత్తుకు తగిన బరువు తప్పనిసరి.
ఎంపిక
ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటాయి. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. రెంటికి కలిపి మొత్తం మార్కులు 900. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికైనవారికి రెండో దశలో ఎస్‌ఎ్‌సబీ(సర్వీస్ సెలెక్షన్ బోర్డ్) ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో భాగంగా ఆర్మీ, నేవీ విభాగాలకు ఎంపికైన వారికి ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైనవారికి అదనంగా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్(పీఏబీటీ) కూడా ఉంటుంది. ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్‌లో భాగంగా వెర్బల్-నాన్ వెర్బల్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఇందులో నిర్దేశిత అర్హత సాధించినవారికి మాత్రమే రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో సైకలాజికల్ టెస్ట్‌లు, గ్రూప్ ఆఫీసర్ టాస్క్‌లు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్స్ ఉంటాయి. సైకలాజికల్ టెస్ట్‌లో థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్ర్కిప్షన్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. తరవాత ఉండే గ్రూప్ ఆఫీసర్ టాస్క్‌లో గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్ ఎక్సైజ్, హాఫ్ గ్రూప్ టాస్క్, ఇండివిడ్యుయల్ అబ్‌స్టకల్, కమాండ్ టాస్క్, స్నేక్ రేస్/గ్రూప్ అబ్‌స్టకల్ రేస్, ఇండివ్యూడ్వల్ లెక్చర్, ఫైనల్ గ్రూప్ టాస్క్ ఉంటాయి. తరవాత ఇంటర్వ్యూ, అటుపై కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్(పీఏబీటీ)లో ప్రధానంగా పైలట్‌కు కావాల్సిన సామర్థ్యాలు అభ్యర్థిలో ఉన్నాయో లేవో పరీక్షిస్తారు. చివరిగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే వారు ఎంపిక చేసుకున్న విభాగాన్ని కేటాయిస్తారు.
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో వారు ఎంచుకున్న ప్రాధాన్యం మేరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఇది మూడేళ్లు ఉంటుంది. ఇందులో రెండున్నరేళ్లు అందరికీ కామన్. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ- న్యూఢిల్లీ బ్యాచిలర్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. ఈ క్రమంలో ఆర్మీ కేడెట్లు బీఏ/బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్స్)/ బీటెక్, ఎయిర్‌ఫోర్స్/నేవీ కేడెట్లకు బీటెక్ డిగ్రీ అందజేస్తారు. ఎన్‌డీఏ శిక్షణ పూర్తి చేసుకున్న అందరికీ బీఏ/బీఎస్సీ/బీఎస్సీ(కంప్యూటర్స్) డిగ్రీ అందజేస్తారు. ఎన్‌డీఏ తరవాత ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఉండే తదుపరి శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తేనే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యు) బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. శిక్షణ అనంతరం నిబంధనలను అనుసరించి హోదాతో సర్వీసులోకి తీసుకుని తగు జీతభత్యాలు కల్పిస్తారు.
సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 6
ఎంపిక: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా
రాతపరీక్ష తేదీ: సెప్టెంబరు 6
పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్‌సైట్: upsc.gov.in
Updated Date - 2020-06-18T18:37:24+05:30 IST