పదితో డిప్లొమా కోర్సులు
ABN, First Publish Date - 2020-05-15T18:29:42+05:30
పదో తరగతితో వివిధ ఇంజనీరింగ్/ అగ్రికల్చరల్ కోర్సులను చేయాలనుకునే వారికి చక్కని అవకాశం కల్పిస్తున్నాయి పాలిటెక్నిక్ కళాశాలలు
పదో తరగతితో వివిధ ఇంజనీరింగ్/ అగ్రికల్చరల్ కోర్సులను చేయాలనుకునే వారికి చక్కని అవకాశం కల్పిస్తున్నాయి పాలిటెక్నిక్ కళాశాలలు. ఏటా నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చరల్ కోర్సులో చేరవచ్చు. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తయిన తరవాత నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చు లేదా ఈసెట్(ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) రాసి బీటెక్ కోర్సులో లేటరల్ ఎంట్రీ పొందవచ్చు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్)ని ఏటా స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రెయినింగ్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా ప్రయివేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిప్ట్‌లో నిర్వహించే వివిధ డిప్లొమా కోర్సుల్లో కూడా ఇదే పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. ఇక వ్యవసాయ డిప్లొమా కోర్సులకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పిజెటిఎ్‌సఎయు)లో, దాని అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా పాలిసెట్ ద్వారానే సీట్లు భర్తీ చేస్తారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన వారికి రెండు ర్యాంకులను కేటాయిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ వ్యవసాయ, దాని అనుబంధ కోర్సుల్లోగానీ ప్రవేశం పొందవచ్చు. అయితే ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సులకు సంబంఽధించిన అడ్మిషన్ కౌన్సెలింగ్ విడి విడిగా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్/నాన్‌ఇంజనీరింగ్‌కి సంబంధించి స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్; వ్యవసాయం, దాని అనుబంధ కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్స్ కూడా విడి విడిగానే వెలువడతాయి.
డిప్లొమా ఇన్ ఫార్మసి అండ్ హోటెల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరాలనుకొనే వారు ‘దోస్త్ 2020’ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్. మూడేళ్ల ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో టెక్నీషియన్స్, టెక్నికల్ సూపర్‌వైజర్లుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
అర్హతలు
మేథ్స్ తప్పనిసరి సబ్జెక్టుగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. సిబిఎస్‌ఇ, ఐసిఎ్‌సఇ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(ఎన్‌ఐఔస్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టిఔ్‌సఎస్), ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ(ఎంపిఔ్‌సఎస్) నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైవారు కూడా అర్హులే.
ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ కోర్సులు
సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, హోంసైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే
కోర్సులు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్(మూడేళ్లు)
Updated Date - 2020-05-15T18:29:42+05:30 IST