ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులపై ఒత్తిడి వద్దు

ABN, First Publish Date - 2020-11-03T15:21:02+05:30

‘‘విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. వారి చదువులు ఆనందంగా సాగాలి. కొవిడ్‌-19 కారణంగా వృఽథా అయిన కాలాన్ని పూర్తిచేసే ఉద్దేశంతో ఒత్తిడి తీసుకురావడం సరికాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు: సీఎం జగన్‌


అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. వారి చదువులు ఆనందంగా సాగాలి. కొవిడ్‌-19 కారణంగా వృఽథా అయిన కాలాన్ని పూర్తిచేసే ఉద్దేశంతో ఒత్తిడి తీసుకురావడం సరికాదు. ఆ పరిస్థితి తీసుకురావొద్దు’’ అని సీఎం జగన్‌ విద్యాశాఖ  అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై సోమవారం ఆయన సమీక్షించారు. కేంద్ర, యూజీసీ మార్గదర్శకాలను పరిశీలించి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రైవేట్‌ సంస్థలకు వెళ్తారని, కాబట్టి ఆయా సంస్థల్లో మెరుగైన సదుపాయాలు, ప్రమాణాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రైవేట్‌ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా, సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు కాలేజీ కోటా కింద కేటాయించుకునే అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కన్వీనర్‌ కోటాలో పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని, వారికి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తుందని తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలకు ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ(న్యాక్‌) గుర్తింపు ఉండాల్సిందేనన్నారు. ఐఐటీ తిరుపతి, ఐఐఎ్‌సఈఆర్‌ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెంలో పనుల ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఆయా సంస్థలకు వెళ్లే రోడ్లు, డ్రైనేజీ, పారిశుఽధ్యం, విద్యుత్‌ వంటి విషయాల్లో సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ట్రైబల్‌ యూనివర్సిటీ పనులపై దృష్టి సారించాలన్నారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకురావాలని, డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగ కల్పనా కేంద్రాలుగా పాలిటెక్నిక్‌ కాలేజీలను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి వీటిలో మరింత నైపుణ్య శిక్షణ ఇస్తారని చెప్పారు. అదేవిధంగా సామర్థ్యాన్ని పెంచేలా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కెపాసిటీ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ను తీసుకురావాలని సూచించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌, సీఎస్‌ నీలం సాహ్ని పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T15:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising