1 నుంచి ‘క్లాట్-2021’ దరఖాస్తుల స్వీకరణ
ABN, First Publish Date - 2020-12-29T16:07:45+05:30
హైదరాబాద్‌లోని నల్సార్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2021 నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్‌లోని నల్సార్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2021 నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై మార్చి 31 వరకు కొనసాగనుంది. మే 9న మధ్యాహ్నం 3-5 గంటల వరకు పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుందని క్లాట్-2021 కన్వీనర్ ప్రొఫెసర్ విజేందర్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2020-12-29T16:07:45+05:30 IST