ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజీ మెడికల్‌ ఫీజులపై కుస్తీ

ABN, First Publish Date - 2020-05-24T16:44:32+05:30

మెడికల్‌, డెంటల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సుల కొత్త ట్యూషన్‌ ఫీజులపై ఏపీ ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చేపట్టిన కసరత్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ తగ్గింపు దిశగా చర్చలు 

‘ఉన్నత విద్య కమిషన్‌’ కసరత్తు 

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): మెడికల్‌, డెంటల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సుల కొత్త ట్యూషన్‌ ఫీజులపై ఏపీ ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరింది. 2017-18 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్న ఫీజులతో పోలిస్తే కొత్తగా నిర్ధారించే ఫీ జులు భారీగా తగ్గించే దిశగా చర్చిస్తున్నట్లు సమాచారం. కొ న్ని కాలేజీలకు గరిష్ఠంగా 30-40ు వరకు కూడా కోత పడనుందని తెలిసింది. యూనిఫాం ఫీజు విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించిన కమిషన్‌... తొలిసారిగా కాలేజీల వారీగా ఫీజును ఫిక్స్‌ చేయాలని భావిస్తోంది. కొత్త ప్రతిపాదనలను ముందుగా సీఎంకు వివరించి తదనుగుణంగా సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని కమిషన్‌ భావిస్తోంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ 2017 మే 3న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. కన్వీనర్‌ కోటా సీట్లకు రూ.6.90లక్షలు, మేనేజ్‌మెంట్‌ కోటా(ఎస్‌-1) సీట్లకు రూ.24.20 లక్షలు, మేనేజ్‌మెంట్‌ కోటా(ఎస్‌-2, 3) సీట్లకు ఎస్‌-1 సీట్లపై మూడు రెట్లకు మించకుండా ఫీజు తీసుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 5శాతం ఫీజు పెంచాలని కూడా సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ లె క్కన మేనేజ్‌మెంట్‌ కోటాలో ఈసారి ట్యూషన్‌ ఫీజును రూ. 28లక్షల వరకూ నిర్ధారించాలని కాలేజీల మేనేజ్‌మెంట్లు కో రుతున్నాయి. 

Updated Date - 2020-05-24T16:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising