రోడ్డున పడ్డ 460 మంది ఉద్యోగులు
ABN, First Publish Date - 2020-01-31T16:11:52+05:30
బేగంపేటలోని భారత్ ఫైనాన్స్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ సంస్థ బుధవారం అర్ధరాత్రి 460 మంది ఉద్యోగుల బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు వేసింది. వెంటనే వారిని తొలగిస్తున్నట్లు మెసేజ్ పంపించింది. దీంతో ఉద్యోగులు గురువారం కార్యాలయం ఎదుట
భారత్ ఫైనాన్స్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ ఎదుట ఆందోళన
బేగంపేట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): బేగంపేటలోని భారత్ ఫైనాన్స్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ సంస్థ బుధవారం అర్ధరాత్రి 460 మంది ఉద్యోగుల బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు వేసింది. వెంటనే వారిని తొలగిస్తున్నట్లు మెసేజ్ పంపించింది. దీంతో ఉద్యోగులు గురువారం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సంస్థను నమ్ముకొని పని చేస్తున్న తమను యాజమాన్యం రోడ్డున పడేసిందని, 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలన్న నిబంధనను కూడా పాటించలేదని వాపోయారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కంపెనీ వద్దకొచ్చిన పంజాగుట్ట సీఐ ఉద్యోగులతో చర్చించారు. లేబర్ కోర్టును ఆశ్రయించాలని వారికి సూచించారు. ఆ ఉద్యోగులను ఇతర పనుల్లో వినియోగించుకుంటామని సంస్థ ఎండీ ఎంఆర్ రావు తెలిపారు.
Updated Date - 2020-01-31T16:11:52+05:30 IST