ఏడాది డుమ్మా కొడితే ఇంటికే!
ABN, First Publish Date - 2020-01-22T16:01:13+05:30
అనధికారికంగా ఏడాది పాటు సెలవులో ఉన్న అధ్యాపకులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ఏడాదికి మించి అనధికారికంగా సెలవుల్లో
అనధికార గైర్హాజరు వైద్యవిద్య అధ్యాపకులపై వేటు
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అనధికారికంగా ఏడాది పాటు సెలవులో ఉన్న అధ్యాపకులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ఏడాదికి మించి అనధికారికంగా సెలవుల్లో ఉన్న అధ్యాపకుల వివరాలను పంపాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే సెలవులో ఉండి, మరోమారు సెలవు కోసం దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును తిరస్కరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనధికారిక సెలవుల్లో ఉన్న 30 మంది అధ్యాపకులకు నోటీసులు పంపారు. వారిలో కొందరు మాత్రమే ఆ నోటీసులకు జవాబిచ్చారు. స్పందించని వారిని పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - 2020-01-22T16:01:13+05:30 IST