ఆంగ్ల భాషా బోధనపై 42 పరిశోధన వ్యాసాలు
ABN, First Publish Date - 2020-01-14T16:08:07+05:30
ఆంగ్ల భాషా బోధనపై అంతర్జాతీయ జర్నళ్లలో ఒకే ఏడాదిలో 42 పరిశోధనా వ్యాసాలు రాసి సూర్యాపేట జిల్లాకు చెందిన పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) రికార్డు నెలకొల్పారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు.
శ్రీనివాసరావుకుఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు
హైదరాబాద్ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల భాషా బోధనపై అంతర్జాతీయ జర్నళ్లలో ఒకే ఏడాదిలో 42 పరిశోధనా వ్యాసాలు రాసి సూర్యాపేట జిల్లాకు చెందిన పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) రికార్డు నెలకొల్పారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, సినీనటుడు బాబూమోహన్ శ్రీనివాసరావుకు ఈ రికార్డు సర్టిఫికెట్‌తో పాటు బంగారు పతకాన్ని అందజేశారు. శ్రీనివాసరావు సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ మండలం శ్రీనివాసపురంలో జన్మించారు. సౌదీఅరేబియాలోని కింగ్ ఫైసల్ వర్సిటీలో ఇంగ్లిషు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
Updated Date - 2020-01-14T16:08:07+05:30 IST