పుస్తక పఠనంతో చురుకుదనం
ABN, First Publish Date - 2020-01-28T16:12:08+05:30
పుస్తక పఠనంతో చిన్నారుల్లో చురుకుదనం పెంపొందుతుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పుస్తక పఠనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, చిన్నారుల
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పుస్తక పఠనంతో చిన్నారుల్లో చురుకుదనం పెంపొందుతుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పుస్తక పఠనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, చిన్నారుల విద్యార్జనకు ఇది పరోక్షంగా సహాయపడుతుందన్నారు. రాజ్‌భవన్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ ’బాల సాహితి సూచి’ పేరిట రూపొందించిన పిల్లల పుస్తకాల సమాచారదర్శినిని గవర్నర్ ఆవిష్కరించారు. 1963 నుంచి 2019 వరకు తెలుగులో విడుదల అయిన 6150 పిల్లల పుస్తకాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పుస్తక పఠనం చిన్నారులను పరిశోధనాత్మకులుగా, ఆలోచనాపరులుగా మారుస్తుందన్నా రు. పుస్తకానికి అవసరమైన సమాచారణ సేకరణ, కూర్పును అందించిన రవి శారదతోపాటు ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ సభ్యులను గవర్నర్ అభినందించారు.
Updated Date - 2020-01-28T16:12:08+05:30 IST