ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మంది జేఎన్‌టీయూ విద్యార్థుల సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2020-01-10T16:23:12+05:30

గంజాయి క్రయవిక్రయాలతో సంబంధం ఉన్న 11 మంది జేఎన్‌టీయూ హైదరాబాద్‌ విద్యార్థులను కళాశాల యాజమాన్యం వసతి గృహం నుంచి సస్పెండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంజాయి క్రయ విక్రయాలతో సంబంధం
 
జేఎన్‌టీయూ/హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గంజాయి క్రయవిక్రయాలతో సంబంధం ఉన్న 11 మంది జేఎన్‌టీయూ హైదరాబాద్‌ విద్యార్థులను కళాశాల యాజమాన్యం వసతి గృహం నుంచి సస్పెండ్‌ చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 24న జేఎన్‌టీయూలో ఇద్దరూ ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజాయితో ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వర్సిటీ క్యాంప్‌సలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే దానిపై కమిటీలు వేసి దర్యాప్తు చేయించగా.. 11 మంది విద్యార్థులకు ప్రమేయమున్నట్లు తేలింది.
 
దీంతో, వారి తల్లిదండ్రులు, గార్డియన్లను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఆ తర్వాత వారిని వసతి గృహం నుంచి సస్పెండ్‌ చేశామని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబారెడ్డి తెలిపారు. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు తోటి విద్యార్థులకు అలవాటు చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. క్యాంప్‌సలో కెమెరాలు ఏర్పాటు చేసినా.. సెక్యూరిటీ గార్డుల పనితీరుపై అనుమానాలు లేకపోలేదు. విద్యార్థులకే విక్రయిస్తున్నారా? లేక బయటి వ్యక్తులకు కూడా అమ్ముతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై వర్సిటీ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరు సరఫరా చేస్తున్నారో దర్యాప్తు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-01-10T16:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising