ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాదాపు 50 కోట్లు..ప్రపంచంలో సరైన, అసలు ఉద్యోగాల్లేని వారు

ABN, First Publish Date - 2020-01-22T15:47:28+05:30

ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ నిరుద్యోగులు మరో 25 లక్షల మేర పెరగనున్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) అంచనా. అంతేకాదు, ప్రపంచవ్యాప్తం గా దాదాపు 50 కోట్ల మందికి సరైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2020లో మరో 25 లక్షలు పెరగనున్న నిరుద్యోగులు
హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి లేబర్‌ రిపోర్టు
 
ఐక్యరాజ్య సమితి: ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ నిరుద్యోగులు మరో 25 లక్షల మేర పెరగనున్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) అంచనా. అంతేకాదు, ప్రపంచవ్యాప్తం గా దాదాపు 50 కోట్ల మందికి సరైన ఉద్యోగాల్లేవని యూఎన్‌కు చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక వెల్లడించింది. లక్షలాది మంది సామాన్యులకు ప్రస్తు తం చేస్తున్న పనితో జీవితాన్ని మెరుగుపర్చుకోవడం కష్టమవుతోందని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గయ్‌ రైడర్‌ అన్నారు.
కార్మికులు మెరుగైన పనిని, జీవితాన్ని వెతుక్కోవడానికి పని సంబంధిత అసమానతలు, తొలగింపులు ప్రధాన అడ్డంకిగా మారాయన్నారు. ‘ది వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఔట్‌లుక్‌: ట్రెండ్స్‌ 2020’ పేరుతో ఐఎల్‌ఓ నివేదిక విడుదల చేసింది.
 
నివేదికలో ముఖ్యాంశాలు
 
ప్రస్తుతం ప్రపంచంలో 18.8 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. మరో 16.5 కోట్ల మంది అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారు. 12 కోట్ల మంది ఉద్యోగం కోసం వెతకడం మానేశారు లేదా వారికి ఉద్యోగ ప్రవేశాలకు సరైన అవకాశాలు లభించడం లేదు. అంటే, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితమైన వారు 47 కోట్లకు పైమాటే
గత తొమ్మిదేళ్లుగా ప్రపంచ నిరుద్యోగుల సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోవడంతో కొత్తగా జాబ్‌ మార్కెట్లోకి వచ్చేవారికి తగినన్ని ఉద్యోగాలు లభించే అవకాశాలు కన్పించడం లేదు.
 
ఈ రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద కార్మికులు మరింత పెరగవచ్చు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యానికి ఈ పరిణామం మరింత అవరోధం కావచ్చు
ప్రస్తుతం రోజుకు 3.20 డాలర్ల కంటే తక్కువ ఆర్జించే వారు పేద కార్మికుల పరిధిలోకి వస్తారు. ప్రపంచంలో 63 కోట్ల మంది పేద కార్మికులున్నారు. అంటే, ప్రపంచ కార్మిక శక్తిలో ప్రతి ఐదుగురిలో
ఒకరు పేద కార్మికుడే
లింగ బేధం, వయసు, భౌగోళిక అంశాల్లో అసమానతలు జాబ్‌ మార్కెట్‌ను ఇంకా పీడిస్తున్నాయి. ఈ సమస్యలు వ్యక్తిగత అవకాశాలతోపాటు ఆర్థిక వృద్ధిని పరిమితం చేస్తున్నాయి
ప్రపంచంలో 15 నుంచి 24 ఏళ్లలోపున్న 26.7 కోట్ల మంది ఉద్యోగం, విద్య లేదా శిక్షణలో గానీ లేరు. ఇంకా చాలా మంది పని చేసే చోట అధమ పరిస్థితులను భరిస్తున్నారు
వాణిజ్యపరమైన ఆంక్షలు, స్వీయ రక్షణ చర్యలు ఉద్యోగాల కల్పనపై అమిత ప్రభావం చూపనున్నాయి. జాతీయ ఆదాయంలో వేతనాల వాటా గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ రకమైన ధోరణి ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2020-01-22T15:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising