21న తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభం
ABN, First Publish Date - 2020-01-14T15:43:21+05:30
మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ నుంచి నెల్లూరుకు తరలించిన ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రాన్ని ఈ నెల 21న ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ నుంచి నెల్లూరుకు తరలించిన ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రాన్ని ఈ నెల 21న ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ సోమవారం వెల్లడించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభం కానుంది. కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్, ఏపీ గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రాచీన తెలుగు భాషా అభివృద్ధికి పరిశోధన, సెమినార్లు, చర్చలతో పాటు ఇతర కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది.
Updated Date - 2020-01-14T15:43:21+05:30 IST