ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్‌లో

ABN, First Publish Date - 2020-01-20T15:45:55+05:30

కేకేఆర్‌ హ్యాపీ వేలీ స్కూల్‌ విద్యార్థుల సంచలనం! 17మందికి 99 , 68మందికి 85 కుపైగా పర్సంటైల్‌ శిక్షణ పొందిన విద్యార్థుల్లో 66.6శాతం సక్సెస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేకేఆర్‌ హ్యాపీ వేలీ స్కూల్‌ విద్యార్థుల సంచలనం!
17మందికి 99 , 68మందికి 85 కుపైగా పర్సంటైల్‌
శిక్షణ పొందిన విద్యార్థుల్లో 66.6శాతం సక్సెస్‌
 
హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌ పర్సంటైల్‌ ఫలితాల్లో డా.కేకేఆర్‌ హ్యాపీవేలీ స్కూల్‌కు చెందిన ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలన ఫలితాలు సాధించారు. ఈ స్కూల్లో ఐఐటీ కోచింగ్‌ తీసుకున్న రెండవ బ్యాచ్‌ విద్యార్థుల్లో ఎన్‌.ఎం కుశాల్‌ 99.88, ఎన్‌. వెంకట కీర్తన్‌ 99.86, పీ. కుశ్వంత్‌ 99.79, పి. శ్రీ పృథ్వీరాజ్‌ 99.74 పర్సంటైల్‌ను సాధించారు. ఈ మేరకు స్కూల్‌ యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 99పైన పర్సంటైల్‌ను 17మంది, 95పైన పర్సంటైల్‌ను 37మంది, 90పైన పర్సంటైల్‌ను 50మంది, 85కు పైన పర్సంటైల్‌ను 68మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. తమ వద్ద ఇంటర్‌ సీబీఎ్‌సఈతో పాటు ఐఐటీ జేఈఈ కోచింగ్‌ తీసుకున్న 96మందిలో ఈ ఫలితాల ఆధారంగా 64మంది ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
 
ఈ రకంగా తాము 66.6శాతం సక్సెస్‌ రేటు సాధించామని.. ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ స్కూల్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డు అని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షఽలు తెలిపారు. విద్యార్థుల విజయం కోసం కృషిచేసిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు.

Updated Date - 2020-01-20T15:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising