జేఈఈ మెయిన్స్ పర్సంటైల్‌లో కేకేఆర్ హ్యాపీ వేలీ స్కూల్ విద్యార్థుల హవా
ABN, First Publish Date - 2020-01-20T15:58:36+05:30
జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ ఫలితాల్లో డా.కేకేఆర్ హ్యాపీవేలీ స్కూల్‌కు చెందిన ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలన ఫలితాలు సాధించారు. స్కూల్లో
17మందికి 99%, 68మందికి 85% పైగా పర్సంటైల్
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ ఫలితాల్లో డా.కేకేఆర్ హ్యాపీవేలీ స్కూల్‌కు చెందిన ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలన ఫలితాలు సాధించారు. స్కూల్లో ఐఐటీ కోచింగ్ తీసుకున్న రెండో బ్యాచ్ విద్యార్థుల్లో ఎన్.ఎం కుశాల్ 99.88, ఎన్.వెంకట కీర్తన్ 99.86, పీ.కుశ్వంత్ 99.79, పి.శ్రీపృథ్వీరాజ్ 99.74 పర్సంటైల్‌ను సాధించారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 99పైన పర్సంటైల్‌ను 17మంది, 95పైన పర్సంటైల్‌ను 37మంది, 90పైన పర్సంటైల్‌ను 50మంది, 85కు పైన పర్సంటైల్‌ను 68మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. తమ వద్ద ఇంటర్ సీబీఎ్‌సఈతో పాటు ఐఐటీ జేఈఈ కోచింగ్ తీసుకున్న 96మందిలో ఈ ఫలితాల ఆధారంగా 64మంది ఐఐటీ, ట్రిపుల్ ఐటీలో సీటు సాధించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ఈ రకంగా తాము 66.6శాతం సక్సెస్ రేటు సాధించామని.. ఇది అరుదైన రికార్డు అని తెలిపారు.
Updated Date - 2020-01-20T15:58:36+05:30 IST