ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిచ్చుకల జాడేదీ!

ABN, First Publish Date - 2020-03-20T08:32:50+05:30

పూర్వం పిచ్చుకల కిచకిచలతో నిద్ర లేచేవాళ్ళం. అవి మన ఇంటి చూర్లలోనూ గోడల నెర్రెల్లోనూ గూడు కట్టుకొని ఉండేవి . మనసుకు ఆహ్లాదాన్నే కాదు, ప్రకృతి సమతౌల్యాన్నీ కాపాడేవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూర్వం పిచ్చుకల కిచకిచలతో నిద్ర లేచేవాళ్ళం. అవి మన ఇంటి చూర్లలోనూ గోడల నెర్రెల్లోనూ గూడు కట్టుకొని ఉండేవి . మనసుకు ఆహ్లాదాన్నే కాదు, ప్రకృతి సమతౌల్యాన్నీ కాపాడేవి. ఇప్పుడు వాటి సందడి కనుమరుగైంది. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఇది 2010 నుంచి జరుగుతున్నది. అంతర్జాతీయంగా పిచ్చుకల సంరక్షణ కోసం నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా, మరికొన్ని ఇతర జాతీయ సంస్థల తోడ్పాటుతో ఈ దినోత్సవం జరుగుతున్నది. మానవ జీవితానికి మరింత సౌలభ్యాన్ని జత చేసేందుకు దినదినమూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఈ చిన్న జీవుల పట్ల శాపంగా మారింది. మనం వాడే సెల్ ఫోన్ తరంగాలు, ఇతర రేడియేషన్లు, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం అనేక జీవ రాశుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నది. కొన్ని జాతులు క్రమంగా అంతరిస్తున్నాయి కూడా. అలాంటి జాతుల్లో ఈ పిచ్చుకలు ఒకటి. ప్రతి జీవికీ ప్రకృతి సమతౌల్యంలో ఒక స్థానం ఉంటుంది. ఏ జీవజాతి జనాభా తగ్గినా ప్రకృతిపై దాని ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మనిషి తన స్వార్థం కోసం తోటి గ్రహవాసులను పట్టించుకోకుండా ప్రవర్తిస్తే చివరకు దాని ప్రభావం అతని మీద కూడా పడుతుంది. అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.  

సయ్యద్ షఫీ, హన్మకొండ.

(నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం)

Updated Date - 2020-03-20T08:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising