ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైజాగ్ ఏం తక్కువ?

ABN, First Publish Date - 2020-09-23T06:21:07+05:30

దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష ఈ నెల 26న జరగనుంది. సౌత్ జోన్ రాష్ట్రాల్లో ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో పరీక్ష కేం ద్రాల్ని నిర్ణయిస్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష ఈ నెల 26న జరగనుంది. సౌత్ జోన్ రాష్ట్రాల్లో ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో పరీక్ష కేం ద్రాల్ని నిర్ణయిస్తారు. ఈ సారి కేంద్రాల్లో శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం కేంద్రాలు లిస్టు నుండి మాయం కావడం విశేషం. అంటే ఉత్తరాంధ్ర నుండి పరీక్ష రాయబోతున్న వేలాది విద్యార్థులు వందల కిలోమీటర్ల కొద్దీ దూరం ప్రయాణించాల్సిన దురవస్థ. ఈ కేంద్రాల్ని ఎత్తి వెయ్యడానికి సహేతుక కారణం కనిపించడం లేదు. మళ్లీ రాజ మండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం కేంద్రాలుగా ఉన్నాయి. వాటికన్నా వైజాగ్ ఏ రకంగా తక్కువ. అన్ని సదుపాయాలు ఉన్న నగరమే కదా. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పరీక్షా కేంద్రాల్ని పెంచి ఊరట ఇవ్వాల్సింది పోయి ఉన్న వాటిని తొలగించారు. ప్రజా రవాణా సరిగ్గా లేని, ఆయా పట్టణాల్లో వసతి, భోజన సదుపాయాలు కష్టమైన వేళ, విద్యార్థులకు దూరాభారలు పెంచడం ఎంత బాధ్యతా రాహిత్యం? ఆర్థికంగా కష్టమే కాకుండా, మహమ్మారి వ్యాప్తికి దోహదం చేసే ఈ నిర్ణయం తీవ్ర తప్పిదం. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని ఏమైనా చెయ్యగలిగితే అది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టు. 

డా.డి.వి.జి.శంకరరావు, 

మాజీ ఎంపీ, పార్వతీపురం

Updated Date - 2020-09-23T06:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising