ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్జీకి బతుకు దారేది

ABN, First Publish Date - 2020-02-27T06:41:40+05:30

చాలా వ్యాపారాలను కబళించినట్టే, కార్పొరేట్‌ సంస్థలు వృత్తిదారుల పనులను కూడా మింగేస్తూండడంతో వారంతా వీధిన పడుతున్నారు. ఇదే కోవలో రెడీమేడ్‌ దుస్తుల ఫ్యాక్టరీలు, షోరూములు పెట్టి కుట్టు వృత్తి దారులైన దర్జీలకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా వ్యాపారాలను కబళించినట్టే, కార్పొరేట్‌ సంస్థలు వృత్తిదారుల పనులను కూడా మింగేస్తూండడంతో  వారంతా వీధిన పడుతున్నారు. ఇదే కోవలో రెడీమేడ్‌ దుస్తుల ఫ్యాక్టరీలు, షోరూములు పెట్టి కుట్టు వృత్తి దారులైన దర్జీలకు పనిలేకుండా చేశారు.  దీనితో ప్రతి ముగ్గురిలో  ఒకరు వలసబాట పడ్తున్నారు. కార్పొరేట్లకు తోడుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సామాజిక వర్గాల వారికి టైలరింగ్‌ శిక్షణ ఉచితంగా  ఇప్పించడం  వంటి ఉపాధి శిక్షణా కార్యక్రమాలు కూడా వీరిపట్ల శాపంగా మారి, దర్జీలకు బతుకుదెరువే లేకుండాపోతోంది. మరోపక్క మేరు (దర్జీ) వారిని బీ‍సీ–డీ గ్రూపులోనే ఉంచడంతో ఆర్థికంగా, విద్యా,ఉద్యోగాల పరంగా అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉన్నారు. వీరికి ఆర్థిక సహకారం అందించడానికి మేరు సమాఖ్యను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర బడ్జెట్‌ కేటాయింపులే చేశారు. దీంతో అవసరమైన ఆర్థిక సహాయం అందక వీరు రెక్కాడినా డొక్కాడని బతుకులే గడుపుతున్నారు. తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు బాగు పడతాయన్న ప్రత్యేక రాష్ట్రోద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. 109 మంది మేరు యువకులు ఆత్మబలిదానం చేశారు. తమను బీసీ–ఏ గ్రూప్‌ లో చేర్చాలి. మేరు సమాఖ్యకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయించాని, కుట్టుపనుల కాంట్రాక్టులు, యూనిఫారాలు  మేరు సామాజిక వర్గాలకే ఇవ్వాలి, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించాలి. దర్జీలకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలి.

హరి అశోక్‌కుమార్‌ 

టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2020-02-27T06:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising