ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనం ఇంట్లోనే ఉన్నారు

ABN, First Publish Date - 2020-03-25T07:51:12+05:30

జనం ఇంట్లోనే ఉన్నారు పుస్తకాలు చదివారు, చెబుతున్నది విన్నారు విశ్రాంతి తీసుకొన్నారు, కసరత్తులు చేశారు బొమ్మలు గీశారు, ఆటలు ఆడారు ఉండటం ఎలాగో, ఉన్నచోట ఆగిపోవడం ఎలాగో,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనం ఇంట్లోనే ఉన్నారు

పుస్తకాలు చదివారు, 

చెబుతున్నది విన్నారు

విశ్రాంతి తీసుకొన్నారు, కసరత్తులు చేశారు

బొమ్మలు గీశారు, ఆటలు ఆడారు

ఉండటం ఎలాగో,

ఉన్నచోట ఆగిపోవడం ఎలాగో,

లోతుగా చెవొగ్గి వినడం ఎలాగో కొత్త తరీఖా నేర్చుకొన్నారు.

వారిలో కొందరు ధ్యానించారు

కొందరు క్రీడించారు, కొందరు చిందేశారు

తమ నీడ తాము కొందరు కలుసుకొన్నారు

భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు

అలా జనం స్వస్థత పొందారు


ఈ జనం

ఎవరైతే ఇప్పటిదాకా 

ఏం పట్టకుండా బతికేశారో

ఎవరైతే ప్రమాదకరంగానూ, 

అర్థం లేకుండానూ,

కించిత్తు జాలీ లేకుండానూ జీవించేశారో

ఆ జనం పరోక్షంలో భూమీ స్వస్థత పొందటం మొదలుపెట్టింది.

ప్రమాదం తొలగిపోయాక

మనుషులు ఒకరిని ఒకరు కనుగొన్నారు

చనిపోయినవారికోసం సమాధులు తీశారు

తమకోసం కొత్త అవకాశాలను గాలించారు

రేపటి దునియాను స్వప్నించారు

జీవితానికి కొత్త పాదులు తీయడం మొదలుపెట్టారు

ఇలా వారు తమను 

తాము స్వస్థపరుచుకొన్నట్టే

ఈ భూమినీ సంపూర్ణంగా స్వస్థపరిచారు..

మూలం: కేథలిన్ ఓ మారా

అనువాదం: రివేరా

Updated Date - 2020-03-25T07:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising