ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాషా మంత్రిత్వశాఖను పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2020-12-10T09:42:26+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం బృందం రాయలసీమ జిల్లాలలో అధికారికంగా పర్యటిస్తున్న సందర్భంగా ఈ సూచనలు అమలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం బృందం రాయలసీమ జిల్లాలలో అధికారికంగా పర్యటిస్తున్న సందర్భంగా ఈ సూచనలు అమలు చేయాలని కోరుతున్నాము. 1) అధికార భాషా సంఘంలో రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఒక సభ్యుడు కూడా లేరు. ఈ ప్రాంతాల కనీసం ముగ్గురు సభ్యులకు అవకాశం కల్పించాలి. 2) రాజ్యాంగబద్ధంగా తెలుగులో చదువుకునే హక్కుకు భంగం కలగకుండా ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు భాషకు ఉపాధ్యాయులను నియమించాలి. 3) రాయలసీమ పరిసరాలలోని కన్నడ, తమిళ, ఉర్దూ మాధ్యమాల పాఠశాలలను సంరక్షించాలి. 4) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ పరీక్షలను మాతృభాషలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. 5) భాషా మంత్రిత్వశాఖను పునరుద్ధరించాలి. అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో అధికారికంగా జిల్లా, మండల, గ్రామస్థాయి భాషా సంఘాలు నెలకొలి. 6) తెలుగు విశ్వవిద్యాలయం పాలన కేంద్రాన్ని శ్రీశైలంలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెలకొల్పాలి. 7) విభజన చట్టంలో ప్రస్తావించిన తాళపత్రాల అధ్యయన సంస్థ ఏర్పాటు చేపట్టాలి. 8) నెల్లూరులో ఏర్పాటైన తెలుగు ప్రాచీన భాష అధ్యయన కేంద్రంలో పూర్తిస్థాయి సంచాలకులను, సిబ్బందిని, పరిశోధకులను నియమించాలి. 9) రాష్ట్రంలోని ప్రాచీన శాసనాలను రక్షణకు ఆధునిక సాంకేతిక పద్ధతులలో చర్యలు చేపట్టాలి. 10) జిల్లా కేంద్రాలలో భాషా భవన్‌లను నిర్మించాలి. 

డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం, అనంతపురము

Updated Date - 2020-12-10T09:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising