ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వరవర’ విడుదలకు చొరవ తీసుకోండి!

ABN, First Publish Date - 2020-07-15T05:47:27+05:30

ప్రముఖ విప్లవ కవి పెండ్యాల వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేయుటకు యత్నించాలని, అనారోగ్యం, కొవిడ్‌–19 ప్రమాదం రీత్యా అతన్ని ప్రాణాలతో తలోజా సెంట్రల్‌ జైలు (మహారాష్ట్ర) నుండి బయటకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు గారికి,

ప్రముఖ విప్లవ కవి పెండ్యాల వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేయుటకు యత్నించాలని, అనారోగ్యం, కొవిడ్‌–19 ప్రమాదం రీత్యా అతన్ని ప్రాణాలతో తలోజా సెంట్రల్‌ జైలు (మహారాష్ట్ర) నుండి బయటకు తీసుకురావాలని తెలుగు సమాజంలోని ప్రముఖులు ఎంతో మంది తమరికి బహిరంగంగా విజ్ఞప్తి చేసి ఉన్నారు. గడిచిన నాలుగు నెలలుగా కోర్టుల్లో ముద్దాయిల ప్రత్యక్ష విచారణ లేనందున కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు అందుబాటులో ఉన్న చర్లపల్లి కేంద్రగారానికి తరలించడానికైనా తమరి ప్రభుత్వ చొరవ తీసుకోవాల్సి ఉంది. bail is compulsion అనడానికి అన్నిరకాల చట్టబద్ధ అవకాశాలున్న నేపథ్యంలో మీరు వరవరరావు విడుదలకు చొరవ తీసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.


తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో లెఫ్ట్‌ – రైట్‌ అనే తేడాలన్ని మరిచి అన్ని పార్టీలు, సంస్థలు తమ రాజకీయ విభేదాల కతీతంగా ఉమ్మడి అంగీకార అంశాలపై కలిసి పనిచేశాయి. ఈ క్రమంలో తమరు, వరవరరావు, నేను అంతా కల్సి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మానవతా కోణంలో వరవరరావును రక్షించుకోవాలని తెలుగు సమాజమంతా కోరుతున్న నేపథ్యంలో తమరు చొరవచూపాలనేదే నా విన్నపం.


వరవరరావు తన జీవిత కాలంలో ఎన్నో కేసులను ఎదుర్కొని నిలబడ్డారు గానీ పారిపోలేదు. ఈ ముదిమి వయస్సులో ఎక్కడికి పారిపోరు, విచారణను ఎదుర్కొంటారని కుటుంబ సభ్యులంతా హామీ పడ్తున్న స్థితిని తమరు పరిగణనలోనికి తీసుకోవాలని విన్నవిస్తున్నాను.

విమలక్క

తెలంగాణ ప్రజా ఉద్యమ గాయని

Updated Date - 2020-07-15T05:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising