ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలను పట్టించుకోండి

ABN, First Publish Date - 2020-02-27T06:44:17+05:30

పిల్లలకు నేనిచ్చే ఆస్తి చదువేనని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల దుస్థితిని ఓ సారి సమీక్షించాలి. కనీసం మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలకు నేనిచ్చే ఆస్తి చదువేనని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల దుస్థితిని ఓ సారి సమీక్షించాలి. కనీసం మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేని పాఠశాలలు కోకొల్లలు. అలాగే దాదాపు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలోనూ ఖాళీల సంఖ్య యాభైవేల పైమాటే. ఇక మధ్యాహ్న భోజనం అధ్వాన్న భోజనంగా మారింది. విద్యా సంవత్సరం ముగింపు కావస్తున్నా ఏక రూప దుస్తుల పంపిణీ పూర్తి కాలేదు! గత ప్రభుత్వ పథకాలనే కాస్త అటూ ఇటూ మార్చి, పాఠశాలలకు రంగులు వేసి అదే విప్లవాత్మకం అని భారీ ప్రకటనలు ఇచ్చుకున్నారు సరే... విద్యార్థులను, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలను పట్టించుకోరా? భావి భారత పౌరుల భవిష్యత్తుపై దృష్టి పెట్టి అవసరమైనవి సమకూర్చండి. తద్వారా విద్యార్థులపట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి. 

కంభంపాటి కోటేశ్వర రావు, విశాఖపట్నం

Updated Date - 2020-02-27T06:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising