ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ కుటుంబాల పరం కారాదు

ABN, First Publish Date - 2020-03-04T07:44:00+05:30

రాజ్యసభ (పెద్దల సభ) రానురాను రాజకీయ పార్టీల అధినాయకులు, వారి కుటుంబ సభ్యులను పంపే వేదికగా తయారవుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా కూతురు ప్రియాంక గాంధీ, టీఆర్‌ఎస్‌ నుండి కేసీఆర్‌ కుమార్తె కవిత, వైసీపీ నుండి జగన్ చెల్లెలు షర్మిల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభ (పెద్దల సభ) రానురాను రాజకీయ పార్టీల అధినాయకులు, వారి కుటుంబ సభ్యులను పంపే వేదికగా తయారవుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా కూతురు ప్రియాంక గాంధీ, టీఆర్‌ఎస్‌ నుండి కేసీఆర్‌ కుమార్తె కవిత, వైసీపీ నుండి జగన్ చెల్లెలు షర్మిల, ఇతర పార్టీల నుండి కుటుంబ సభ్యులను రాజ్యసభకు పంపుతున్నట్లు వార్తలు వెలువడుతుండడం చూస్తుంటే రాజ్యసభ ఇందుకేనా అన్న ఆవేదన కలుగుతోంది. మేధావులు, వివిధ రంగాల్లో సేవలు చేసిన నిష్ణాతులు, దేశం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తులకు పెద్దల సభలో చోటు దక్కేది. వారి సూచనలు సలహాలతో దేశానికి మేలు చేసే నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు కుటుంబ సభ్యులను పంపి దేశానికి, ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వదలచు కున్నారో అంతుచిక్కని ప్రశ్నగా‌ ఉంది. ఆర్థిక మాంద్యంతో పాటు సవాలక్ష సమస్యలు వెంటాడుతున్న ప్రస్తుతం తరుణంలో వాటికి పరిష్కారం చూపగలిగే మేధావులను రాజ్యసభకు పంపితే ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా పార్టీలు కార్యాచరణ చేపడితే దేశానికి మేలు చేసినట్టవుతుంది. రాజ్యసభ కుటుంబాల పరం కారాదు.

యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

Updated Date - 2020-03-04T07:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising