ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సలాం కేసులో శీఘ్ర సిబిఐ దర్యాప్తు

ABN, First Publish Date - 2020-12-09T06:23:38+05:30

సలాం తన భార్య పిల్లలతో కలసి తీసుకున్న వీడియో చూసిన అందరి మనసులను కలచివేసింది. అతను ఆ వీడియోలో తను ఏ నేరము...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సలాం తన భార్య పిల్లలతో కలసి తీసుకున్న వీడియో చూసిన అందరి మనసులను కలచివేసింది. అతను ఆ వీడియోలో తను ఏ నేరము చేయలేదని, తమను పోలీసులు అనవసరంగా వేధిస్తున్నారని, తమకు ఎవరి మద్దతు లేదని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పాడు. తమను వేధిస్తున్నది ఎవరనేది చెప్పలేదు. వీడియోలో చెప్పినట్టుగానే నవంబర్ 3న పాణ్యం స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అయిన నాటికే నంద్యాల రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డియస్పి మరోసారి కేసును విచారించి, ఐపిసి 306 సెక్షన్ చేర్చినా, ఆత్మహత్య ప్రేరణకు తగిన వివరాలు సవివరంగా రాయకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు శాసన మండలిలో సలాం కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రితో సంప్రదించి సిబిఐతో దర్యాప్తుచేయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి సిబిఐతో విచారణ జరిపించాలి. 

యు.జి. శ్రీనివాసులు, ఆదోని

Updated Date - 2020-12-09T06:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising