ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టు మేన్‌

ABN, First Publish Date - 2020-05-04T06:22:41+05:30

ఎందుకమ్మా నీవు దిగులుగా ఉన్నావు? నేలపయి గోడకు చేరబడ్డావు చల్లగా జల్లు నీమీద పడుతోంది నీ చీర దాదాపు తడిసిపోయింది జేగంట నాలుగు సార్లు మ్రోగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎందుకమ్మా నీవు దిగులుగా ఉన్నావు?

నేలపయి గోడకు చేరబడ్డావు

చల్లగా జల్లు నీమీద పడుతోంది

నీ చీర దాదాపు తడిసిపోయింది


జేగంట నాలుగు సార్లు మ్రోగింది

బడినుండి అన్నయ్య ఇంటికొస్తాడు

నీకివన్నీ ఎందుకు గుర్తులేవమ్మా?

నాన్న వ్రాసిన లేఖ అందుకోలేదా?


పోస్టుమేన్‌ ఉత్తరాలు చాలా తెచ్చాడు

ఊళ్ళో అందరికీ పంచిపెట్టాడు

నాన్నారి ఉత్తరం దాచుకొన్నాడా?

పోస్టుమేన్‌ చాలా చెడ్డవాడమ్మా?


అయినా నీకు దిగులెందుకమ్మా

కలం, కాగితం తెప్పించమ్మా

నాన్నారి ఉత్తరం నేనే వ్రాస్తాను

గీతమీదే గీత గురుతుగా వ్రాస్తాను


ఉత్తరం స్వయముగా తీసికొస్తాను

చదవటంలో నీకు సాయపడుతాను

పోస్టుమేనును నేను నమ్మలేనమ్మా

నా మంచి ఉత్తరం నీకివ్వడమ్మా

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

అనుసృజన: జె. భాగ్యలక్ష్మి

Updated Date - 2020-05-04T06:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising