ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగడ్తల ప్రతిధ్వని

ABN, First Publish Date - 2020-09-07T06:18:56+05:30

కులం పేరు నిందార్థకమైనప్పుడు పెదవి విప్పడమే పెద్ద ప్రమాదమౌతుంది వర్తమాన మానంపై పూర్వీకం అవమానమై నిలిచినప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులం పేరు నిందార్థకమైనప్పుడు

పెదవి విప్పడమే పెద్ద ప్రమాదమౌతుంది


వర్తమాన మానంపై

పూర్వీకం అవమానమై నిలిచినప్పుడు

గొంతులో అవసరం వొత్తు వేసుకొని

పొగడ్తల తడిపొడి దీపాల్ని వెలిగించుకోవాలా...


మాటల్ని

తల్లకిందులు చేసే అక్షర గబ్బిలాలకి

 ప్రశంసా పరిమళపు రెక్కల్ని తగిలించి

పైపైకి ఎగిరించక్కర్లెద్దు


నిద్రకు మెలకువ గుండు సూది దిగినట్లు

కళ్లూ పిడికిళ్లూ ముడుసుకుంటుంటే

వొఠి వెచ్చదనం ఆలోచనలే...


చీకటి చీలిక ల్లోంచి 

మిగిలి పోయినదేదో చెప్పాలని

పెనునిద్దర పొలిమేర దాటి వచ్చినట్లుంది


ఖండాంతరాలక్కూడా పరివ్యాప్తించే

ప్రశంసా ప్రతిధ్వనుల ముందు

ఈ మట్టి ఏ ఒక్కడి దేహదేవళం కాదు


అక్షరాలకి అవసరార్థం-

అనవసరపు అందచందాల్ని అద్దే

ఎవరి జాగా వాళ్లదే... ఎవరి పాగా వాళ్లదే...


ముఖాలు ముఖాలుగా బహుళమై

దుఃఖస్మృతుల్లోకి ఆత్మను ప్రవేశపెడ్తున్నట్లు

మట్టే కాదు

మెట్టు మీద అక్షర దీపం కూడా

అవమానపు రక్తంతో తడిసిపోతుంది


బతికే హక్కును

బతిమాలుకు తాకట్టు పెట్టుకుంటూ

పొగిడేది ఒక్క భట్రాజులేనా...!?!

ప్రశ్నని పదునైన కత్తిలా కడుపులో దాచుకుంటూ

ఇంక ఉగ్గపట్టలేను

ప్రశంసించినంత నగ్నంగా అభిశంసిస్తూ....

ఎస్‌.ఆర్‌. భల్లం

98854 42642


Updated Date - 2020-09-07T06:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising