ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిసి నడిసీ...

ABN, First Publish Date - 2020-05-18T09:56:27+05:30

కసింత ఆలోసించండి నాయన్లారా కవుర్లు కరుసెట్టీకండి మామేటి ఇమానాలు ఎక్కి దిగినోళుమా ఎగవదేశాలంట ఎల్లొచ్చినోళుమా అక్కడ అంటించుకోనొచ్చి ఇక్కడ ముట్టించీడాకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కసింత ఆలోసించండి నాయన్లారా

కవుర్లు కరుసెట్టీకండి

మామేటి ఇమానాలు ఎక్కి దిగినోళుమా

ఎగవదేశాలంట ఎల్లొచ్చినోళుమా

అక్కడ అంటించుకోనొచ్చి ఇక్కడ ముట్టించీడాకి,


‘జరిగొత్తే జల్లిడితోటి నీళు మోత్తారనీ’ 

మీకేటిపోయింది..

మారాజు కొడుకులు మీరు

కాలుమీద కాలేసి కూకున్నా కాలమెల్లిపోతాది

మాకెలా కుదురుతాది?

కడుపు జరగనోళ్ళం.. కూటికి గతిలేనోళ్లం

యిదం సెడి ఇసక తట్టల కింద 

యింకిపోతున్న సెమట సుక్కలం

మా రాతమారి మండుటెండల్ల

మరిగిపోతున్న మాంసం ముద్దలం,


కసింత గుట్టుగ వుండండి బావుల్లారా

కోపం వుదిమిల దాసుకోండి

మామేటి.. ఇసరాయింగ యీదులంట తిరిగినోళుమా

పార్టీలనుకోని పదీమందితోటి గెంతినోళుమా

ఎక్కడో తగిలించుకొచ్చి ఇక్కడ తమాస సూడ్డానికి


‘జరిగితే జొరమంత సుకం లేదనీ’ 

మీకేటి లోటు...

పెట్టిపుట్టిన పెద్దోలు మీరు

గుడ్డూ గులకా.. నడ్డూ నసుకూ

కూకున్నకాడికే కదిలొత్తాయి

మాకెలాగౌతాది ?


రెక్కాడితే గాని డొక్కాడని దిక్కులేనోలుము

కూలాడితేగాని కుండాడని కూలినాలోలుము

ఏమూల పని దొరికితే ఆ మూలకి 

సీమల్లాగ సెదిరిపోయినోలుము

యెక్కడ పిడికిడు గింజలు దొరుకుతాయంతే 

అక్కడికి పిట్టల్లాగ ఎగిరెళ్ళినోలుము


ఇప్పుడొచ్చిపడిందీ వొల్లకాటి నిరబందన

ఇంటిలుంతే ఇగిరి సవ్వాల

యీదిలబడితే కరోనాకి బలవ్వాల


మహానుభావుల్లారా.. మారాజు కొడుకుల్లారా..

ఇనండి

ఎక్కడో.. ఎరగని సోట, ఎవులింటి యిలాకత్తలో యీ ‘కట్టి’ 

దిక్కులేకుంట రాలిపోవడం కంట


అయినోళ మద్దిని ‘అంసెగిరిపోతే’ అదే సాల్ను

పీనుగెత్తడానికి పదిమందుంతారని ఆశ


ఆ ఆశతోటే... దర్మపెబువుల్లారా

ఇలగ.. ఇంతదూరమూ..

ఇంతింత దూరమూ.....

నెత్తిని బరువుల్తోటి

సెంకని సంటి పిల్లల్తోటి

నడిసి.. నడిసి, నడిసి.. నడిసి

నడిసీ.... నడిసీ... నడిసీ....

న. . . . డి. . . . సి

న      డి      సి

(చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు వంటి నగరాల నుంచి 

మూటాముల్లెతో బయలుదేరిన మా వాళ్ళ గురించి తెలిసి)

లాంగుల్య

Updated Date - 2020-05-18T09:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising