ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిట్టచావు

ABN, First Publish Date - 2020-05-25T09:52:20+05:30

హెచ్చరిక లేకుండా నగరపు చెట్లమీద భయం పిడుగు పడింది గూళ్ళతోసహా పాతుకున్న వేళ్ళతోసహా ఆకులూ రెమ్మలూ చెట్లూ ఉన్నచోటే తగలడ్డాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్చరిక లేకుండా నగరపు చెట్లమీద 

భయం పిడుగు పడింది 

గూళ్ళతోసహా పాతుకున్న వేళ్ళతోసహా 

ఆకులూ రెమ్మలూ చెట్లూ 

ఉన్నచోటే తగలడ్డాయి

మానవీయ కరుణతోసహా 

నగరం తగలడింది


మండేకొమ్మలపై నుండి 

వలసొచ్చి తచ్చాడు పిట్టలు 

నుసిగుట్టలై రాలిపడ్డాయి

ఇటుకల బట్టీలు కట్టి 

తట్టల ఇసకెత్తి ఇళ్ళు కట్టి

గోడలపై తమ రెక్కల వర్ణాల రంగులేసిన 

పిట్టల్ని   

తట్టి దులిపేసిన చెదల్లాగా

నగరం వెలి వేసింది


తిరిగి వలస మొదలైంది

తమ తారుచెమటల తనువులే రోలర్లై వేసిన 

నిర్దయ రోడ్ల మీద 

నగరవాసులు దయతో ఈ పూటకి తమ కొదిలేసిన 

కాలుతున్న కరోనా ఏకాకి రోడ్ల మీద 

పిట్టల వలస మొదలైంది 

నగరం వేసిన వెలితో 

అలసట లేని వెలితి బతుకు 

తిరుగు వలస మొదలైంది 

బతుకు తిరుగుడు పిట్టలకి 

నగరమిప్పుడు ఆక్సిజన్‌ లేని వెంటిలేటర్‌ 


పిట్టలంతా ఒక్కటై ఏకాకి గుంపులై 

కదులుతున్నాయి స్మశానాలు కదిలినట్లు 

నగరపు స్మశానాలనొదిలి 

సగం కాలి నిట్టనిలువున తిరిగి లేచే

శవపు ఆశలా

చెక్కు లేచిపోయి పుండ్లయిన పాదాలు 

         మరొక్క అడుగు వేస్తున్నాయి 


పనీ ఇవ్వకా, గడ్డు కాలాన 

బతుకు జీతమూ ఇవ్వక

గుప్పెడు మెతుకులూ గుండెంత గూడూ ఇవ్వని

ఎవరికీ పట్టనితనమో

పట్టణత్వమో

ఏ రైలు పట్టాలో ఏ ఆకలో ఏ దప్పికో 

ఏది కాటేస్తుందో మరేది దహిస్తుందో

ఏ పిట్ట ఎక్కడ రాలిపడుతుందో


పిట్టలెలా చస్తాయో

ఎవరూ చూడరంటారు 

పిట్ట చావు పక్క పిట్టకి కూడా తెలీదంటారు

తన చావు పక్క పిట్ట వలసని ఆపదంటారు

వలసైనా తిరుగు వలసైనా... 

విప్పగుంట రామ మనోహర


Updated Date - 2020-05-25T09:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising