ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఆకాశవాణి పెద్దయ్య

ABN, First Publish Date - 2020-12-31T06:18:32+05:30

మా అందరికీ పెద్దయ్య - ఘంటా విజయకుమార్‌. ఆకాశవాణి పెద్దయ్యగా శ్రోతలకూ సుపరిచితులే. ఏ కేంద్రంలో ఏ విభాగంలో పనిచేసినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మా అందరికీ పెద్దయ్య - ఘంటా విజయకుమార్‌. ఆకాశవాణి పెద్దయ్యగా శ్రోతలకూ సుపరిచితులే. ఏ కేంద్రంలో ఏ విభాగంలో పనిచేసినా ఆ విభాగానికి ఉత్తమ సేవలందించి వన్నె తెచ్చారు విజయ్‌కుమార్‌. ముఖ్యంగా పాడి-పంట పెద్దయ్యగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన సంభాషణల్లో ఆయన తన పాత్రను అత్యంత సృజనాత్మకంగా పోషించి, సదరు కార్యక్రమాల ద్వారా అనుకున్న ప్రయోజనం నెరవేరేలా చేయడంలో ఆయన నైపుణ్యం అమోఘం. విజయకుమార్‌ తన వృత్తికి వ్యక్తిత్వాన్ని జోడించి ఇటు అధికారుల, అటు శ్రోతల హృదయాలు గెలిచారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కర్నూలు, విజయవాడ కేంద్రాలలో పనిచేశారు. వ్యవసాయ విభాగంతో పాటు, మార్కెటింగ్‌, ఎఫ్‌.ఎం. చానల్స్‌, కో ఆర్డినేషన్‌, ప్రోగ్రాం డివిజన్‌ హెడ్‌గా విధులు నిర్వహించారు. ప్రోగ్రాం స్టాఫ్‌ అసోసియేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టి, అది క్రియాశీలకంగా పనిచేసేందుకు కారకులయ్యారు. ఆకాశవాణికి ముందు పొగాకు బోర్డులో పనిచేశారు. తక్కువ శ్రేణి ఉద్యోగమైనా ఆకాశవాణిలో చేరి, వృత్తికి పూర్తి న్యాయం చేశారు. మూడు దశాబ్దాల పాటు ఆకాశవాణిలో వివిధ కేంద్రాలలో పలు విభాగాలలో పనిచేసి, నేడు పదవీ విరమణ చేస్తున్న ఆయన క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, సృజనశీలత, సమయపాలనలు ఆకాశవాణి ఉద్యోగులందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. 

జి. నాగేశ్వరరెడ్డి,

ఆకాశవాణి, అనంతపురం

Updated Date - 2020-12-31T06:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising